అల్లు అర్జున్ ఇంతవరకు పుష్ప సినిమాలో కనిపించిన మాస్ లుక్ లో మరే సినిమాలో కనిపించలేదనే చెప్పాలి. హెయిర్ పెంచేసి.. మాసివ్ గా గెడ్డం పెంచి.. పిచ్చి బట్టలు వేసుకుని, కళ్ళకి అద్దాలు పెట్టుకుని డిఫ్రెంట్ మాస్ లుక్ లో కనిపించాడు. ఇక డిసెంబర్ 17 న రిలీజ్ కాబోతున్న పుష్ప పై అంచనాలు ఏ లెవల్లో ఉన్నాయో.. సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యే హాష్ టాగ్స్ చూస్తే తెలుస్తుంది. డిసెంబర్ 6 న పుష్ప మూవీ ట్రైలర్ రిలీజ్ చేస్తున్న విషయాన్ని రోజుకో పోస్టర్ తో ప్రకటిస్తూ సినిమాపై అంచనాలు అంతకంతకు పెంచేస్తున్నారు. అయితే అందులో అల్లు అర్జున్ అంటే ట్రైలర్ రిలీజ్ పోస్టర్స్, ఫొటోస్ లో అల్లు అర్జున్ డిఫరెంట్ డిఫరెంట్ పోస్టర్స్ తో కనిపించడమే కాదు అల్లు అర్జున్ ఆ పిక్స్ లో చాలా రకాల షేడ్స్ లో కనిపిస్తున్నాడు.
ఒకసారి లుంగీ తో, ఒకసారి ప్యాంట్ షర్ట్ తోనూ, మరోసారి.. తగ్గేదెలా అంటూ ఇచ్చే మాస్ ఫోజులకి అల్లు అర్జున్ ఫాన్స్ కి పిచ్చెక్కిపోతుంది. అల్లు అర్జున్ పుష్ప రాజ్ మాస్ లుక్ కి ట్రైలర్ రిలీజ్ అంటూ కౌన్ డౌన్ పోస్టర్స్ కి ఇచ్చే లుక్స్ అన్నీ అదిరిపోతున్నాయి. అందుకే అనేది పుష్ప మూవీలో అల్లు అర్జున్ రకరకాల మాస్ షేడ్స్ మాములుగా లేవు అనేది. ఇక ఈ సినిమాలో రష్మిక లుక్, అనసూయ లుక్, సునీల్, ఫహద్ ఫాసిల్ అన్ని లుక్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి.