బిగ్ బాస్ సీజన్ 5 లో హద్దు మీరి హగ్గులు, హద్దు మీరి ముద్దులతో సిరి అండ్ షణ్ముఖ్ లు చాలా ఓవర్ చేసారు. బిగ్ బాస్ బయట కూడా సిరి - షణ్ముఖ్ ల హగ్స్ ని ముద్దులని తెగ ట్రోల్ చేసారు. కానీ సిరి మదర్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అవడంతో.. సిరి - షణ్ముఖ్ ల హగ్స్ విషయంలో అందరికి ఓ క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. మాట్లాడితే హగ్స్ ఇచ్చుకుంటూ.. సిరి అండ్ షణ్ముఖ్ లు మిగతా హౌస్ మేట్స్ ని కూడా ఇరిటేట్ చేసారు. అయితే సిరి మదర్ ఓపెన్ గా వారి హగ్స్ నచ్ఛలేదు అనడంతో షణ్ముఖ్ కి భయం పట్టుకుంది. కానీ సిరి మాత్రం ఆమె తల్లినే తిట్టింది. ఇక తరవాత ఈ హగ్స్ కి ఎండ్ కార్డు పడుతుంది అనే అనుకున్నారు.
కానీ సిరి - షణ్ముఖ్ లు హగ్స్ ఇచ్చుకుంటూ ఓన్లీ ఫ్రెండ్ షిప్ మాత్రమే అంటూ కెమెరాలకు చెప్పుకుంటూ కవర్ చేస్తున్నారు. నిన్న రాత్రి ఎపిసోడ్ లోనూ సిరి షణ్ముఖ్ కి హగ్ ఇచ్చింది. తాను నడవలేకపోతున్నాను అని, షణ్ముఖ్ తనకి బాగా హెల్ప్ చేస్తున్నాడు కాబట్టే హగ్ ఇవ్వాలి అని అంది.. అలా హగ్ ఇస్తూ కేవలం ఫ్రెండ్ షిప్ అంటూ మరోసారి సిరి, షణ్ముఖ్ లు చెప్పడం చూస్తే.. ఇది నిజంగానే కామెడీ అనిపిస్తుంది. తర్వాత ప్రియాంక సిస్టర్ కి కూడా హగ్ ఇవ్వు అని షన్ను ని అడగ్గానే.. షణ్ముఖ్ లేచాడు.. కానీ సిరి కాస్త గ్యాప్ ఇవ్వరా అంది.. దానితో షణ్ముఖ్ ఆగిపోయాడు.. ప్రియాంక మాత్రం సచ్చినోడా అంటూ ముద్దుగా తిట్టేసింది.