గత ఒక సంవత్సరము నుండి ఎపుడా ఎపుడా అని ఎదురుచూస్తున్న అఖండ సినిమా ప్రేక్షకాధర పొంది విజయ పతాకం రెపరెప లాడుతూ విజయ శంఖముతో విజయముగా ప్రదర్షింపబడుతున్నది.
మళ్లీ పాత వైభవం వచ్చింది. కరోనా మహమ్మారి తీవ్రతవల్ల సినీ పరిశ్రమ చాలా నష్టపోయింది. ముఖ్యముగా సినీ కార్మికులు, సాంకేతికనిపుణులు, ఎక్సిభిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, వీటిమీద ఆదారబడ్డ చిన్న వ్యాపారస్తులు బాగా దెబ్బ తిన్నారు. వీరందరికి ఈ అఖండ సినిమా ఒక అఖండ జ్యోతి మల్లె మంచి రోజులు వచ్చాయన్న నమ్మకం ఏర్పడింది.
ఇక మన నందమూరి అందగాడు, నటసింహం బాలకృష్ణ గారు తన నటవిశ్వరూపం చూపెట్టారు. తన రికార్డు ఆయనే బద్దలు కొడతారు…. రౌడీ ఇన్స్పెక్టర్ మించిన చిత్రం బొబ్బిలి సింహం మించి నిప్పురవ్వ మించి పెద్దన్న మించి సమరసింహా రెడ్డి మించి నర్సింహానాయుడు మించి లెజెండ్ మించి సింహ మించి నేడు ఇప్పుడు ఈ అఖండ చిత్రం…. చరిత్ర రాయాలన్న, తిరిగిరాయాలన్న మనమే అని మన నందమూరి నటసింహం నిరూపించాడు.
ఈ అఖండా చిత్ర సినిమాటోగ్రఫీ (కెమెరా) రాంప్రసాద్ గారు చానా బాగా అద్భుతంగా చిత్రీకించారు. చిత్ర సంగీత దర్శకులు థమన్ అద్భుతముగా శ్రవణానందముగా సంగీత బాణీ సమకూర్చారు. రీ-రికార్డింగ్ అదరగొట్టేసాడు. మరి మన చిత్ర దర్శకులు బోయపాటి శ్రీను గురించి…. హ్యాట్రిక్, మూడు సినిమాలు వరుసగా వీళిద్దరి కాంబినేషన్ రికార్డులు బద్దలు కొట్టిన మన బోయపాటి, చాలా బాగా దర్శకత్వం వహించారు.
అఖండ చిత్ర నిర్మాత మిర్యాల రవీంద్ర గారు మన నరసింహముతోనూ…బోయపాటి తోనూ మొదటి కాంబినేషన్. వారు మునుముందు ఇటువంటి చిత్రాలు నిర్మించి అగ్రస్థానంలో ఉండాలని కోరుతూ…. నందమూరి రామకృష్ణ.