Advertisementt

సర్ ప్రైజ్: కాజల్ పై సన్నీ ఫైర్

Fri 03rd Dec 2021 10:59 AM
bigg boss telugu 5,bigg boss,bigg boss telugu,sunny vs kajal,sunny,rj kajal,today promo highlights  సర్ ప్రైజ్: కాజల్ పై సన్నీ ఫైర్
Bigg Boss 5: Sunny fires on RJ Kajal సర్ ప్రైజ్: కాజల్ పై సన్నీ ఫైర్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 5 స్టార్ట్ అయ్యాక నాలుగు ఐదు వారలు గడిచేలోపు మానస్ - సన్నీ లు ఫ్రెండ్స్ గా కనెక్ట్ అవడమే కాదు.. బిగ్ బాస్ సీజన్ 5 చివరి వారాల వరకు వాళ్ళ డీప్ ఫ్రెండ్ షిప్ ని కంటిన్యూ చేస్తూనే వచ్చారు. అయితే మధ్యలో ఆర్జే కాజల్ సన్నీకి, మానస్ కి ఫ్రెండ్ గా దగ్గరయ్యింది. ఆమె గేమ్ స్ట్రాటజిలతో హౌస్ మేట్స్ అందరికి విలన్ అయినా సన్నీ, మానస్ లు మాత్రం ఆమెని ఫ్రెండ్ గానే చూస్తున్నారు. కాజల్ సన్నీ కోసం ఎవిక్షన్ ఫ్రీ పాస్ తెచ్చిపెడితే.. కాజల్ ఎక్కడ వెళ్లిపోతుందో అని.. కాజల్ ఎలిమినేట్ అవ్వకుండా ఆ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ని సన్నీ కాజల్ కోసం వాడి ఆమెని సేవ్ చేసాడు.

అంత డీప్ ఫ్రెండ్ షిప్ ఇప్పుడు బీటలు వారినట్లుగా కనిపిస్తుంది. అదేమిటంటే కాజల్ టికెట్ టు ఫినాలే టాస్క్ లో టాప్ 4 కి వెళ్లలేకపోయింది. కాజల్ ఆ టాస్క్ లో అర్హత కోల్పోయింది. మానస్, సిరి, శ్రీరామ చంద్ర, సన్నీలు టికెట్ టు ఫినాలే టాస్క్ లో ఫైనల్ గా పోటీ పడుతున్నారు. అది ఈరోజు బిగ్ బాస్ వాళ్ళకి ఓ పరీక్షా పెట్టగా.. దానిలో భాగంగా సన్నీ బిగ్ బాస్ ఇచ్చిన ప్రశ్నలకి సమాధానాలు రాసుకుంటుంటే కాజల్ వాటికి ఆన్సర్స్ చెప్పెయ్యడంతో.. సన్నీ కాజల్ ని ఇక్కడినుండి పంపెయ్యండి.. బిగ్ బాస్ ఆమె చెప్పేస్తుంది అని అన్నాడు. కాజల్ పదే పదే డిస్ట్రబ్ చెయ్యడంతో సన్నీ కి బాగా కోపం వచ్చింది.. దానితో సన్నీ కాజల్ పై ఫైర్ అయ్యాడు. 

కాజల్ కూడా ఏ మాత్రం తగ్గలేదు, నేనూ ఆడతారా.. బరా బర్ ఆడతాను అంటూ సన్నీ ని మరింతగా డిస్ట్రబ్ చెయ్యడంతో సన్నీ చేతిలోని బుక్ విసిరికొట్టాడు.. దానికి కాజల్ కొడతావా కొట్టు అంటూ గొడవ పడింది. మంచి ఫ్రెండ్షిప్ ని మెయింటింగ్ చేసే సన్నీ - కాజల్ లు ఈ రోజు ఎపిసోడ్ లో గొడవపడినట్లుగా బిగ్ బాస్ చూపించాడు..

Bigg Boss 5: Sunny fires on RJ Kajal:

Bigg Boss Telugu 5: Today Promo highlights 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ