ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Why all OTT's eyes on Rajasekhar's SHEKAR movie

రాజ'శేఖర్' సినిమాకు ఫ్యాన్సీ ఆఫర్లు

Why all OTT's eyes on Rajasekhar's SHEKAR movie

కరోనా పుణ్యమా అని ఓటీటీ సంస్థలన్నీ ఈమధ్యన డైరక్ట్ రిలీజెస్ పై పడ్డాయి. క్రేజీ మూవీస్, బజ్ ఉన్న సినిమాల్ని నేరుగా తమ ఓటీటీ వేదికలపై స్ట్రీమింగ్ కు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా చిన్న చిన్న సినిమాలు మాత్రమే నేరుగా ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి తప్ప, పెద్ద సినిమాలేవీ వీళ్లకు చిక్కడం లేదు. ఈ నేపథ్యంలో.. ఓ సినిమాపై దాదాపు అన్ని ఓటీటీలు కన్నేశాయి. అదే రాజశేఖర్ రీసెంట్ మూవీ శేఖర్. 

రాజశేఖర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను డైరక్ట్ గా ఓటిటి నుండి రిలీజ్ చెంసేందుకు కొన్ని ఓటీటీలు ప్రయత్నిస్తున్నాయి. ప్రముఖ ఓటిటి సంస్థలు శేఖర్ మూవీకి ఫ్యాన్సీ రేట్లు కూడా ఆఫర్ చేశాయి. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం.. శేఖర్ సినిమా డైరక్ట్ స్ట్రీమింగ్ రైట్స్ కోసం (థియేటర్లలో రిలీజ్ చేయకుండా నేరుగా ఓటీటీ రిలీజ్) 22 నుంచి 25 కోట్ల రూపాయల వరకు ఆఫర్లు వచ్చినట్టు తెలుస్తోంది. 

నిజానికి ఈ ఓటీటీలన్నీ శేఖర్ మూవీపై ప్రత్యేకంగా దృష్టిపెట్టడానికి రెండు రీజన్స్ ఉన్నాయి. వాటిలో ఒకటి ఈ సినిమా జానర్. ఈ జానర్ సినిమాలు ఓటీటీలో బాగా నడుస్తాయి. ఇక రెండో రీజన్ ఇది ఆల్రెడీ హిట్టయిన మలయాళ మూవీ జోసెఫ్ కు రీమేక్. కాబట్టి ఓటీటీలకు శేఖర్ మూవీ సేఫ్ బెట్ గా మారింది. దీనికితోడు శేఖర్ గ్లింప్స్ రిలీజైన తర్వాత ఈ ఆఫర్లు ఇంకాస్త ఎక్కువయ్యాయంటున్నారు.

పేరుకు ఇది రీమేక్ మూవీ అయినప్పటికీ తెలుగు నేటివిటీకి తగినట్లుగా కథ-స్క్రీన్ ప్లేలో మార్పుచేర్పులు చేశారు. మరీ ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ కోసం సినిమాలో ఓ సర్ ప్రైజ్ కూడా ప్లాన్ చేశారంట. సినిమా చూసి మాత్రమే ఆ సర్ ప్రైజ్ ఏంటో తెలుసుకోవాలంటున్నారు. ఈ రీమేక్ మూవీకి జీవిత రాజశేఖర్ డైరక్టర్. స్క్రీన్ ప్లే విభాగం కూడా ఆమెనే చూసుకుంటున్నారు. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు

Shekar first glimpse: Dr Rajashekar new look with salt and Pepper

shekar movie
shekar first glimpse
dr rajashekar
ott offers
rajasekhar sekhar movie