Advertisementt

సర్జరీ కోసం అమెరికాకి మహేష్?

Thu 02nd Dec 2021 08:18 PM
mahesh babu,surgery,flying to the us,sarkaru vaari pata movie,parasuram direction,keerthy suresh,mahesh family  సర్జరీ కోసం అమెరికాకి మహేష్?
Mahesh Babu flying to the US for surgery సర్జరీ కోసం అమెరికాకి మహేష్?
Advertisement
Ads by CJ

మహేష్ బాబు నిన్న బుధవారం సిరివెన్నెల సీతారామ శాస్త్రి భౌతిక కాయానికి నివాళులర్పించడానికి వచ్చినప్పుడు.. బాగానే ఉన్నట్లుగా కనిపించారు.. కానీ సాయంత్రానికే మహేష్ కి నీ సర్జరీ అంటూ సోషల్ మీడియాలో వార్తలొచ్చేశాయి. మహేష్ కి చిన్న పాటి ప్రాబ్లెమ్ వలన నీ కి సర్జరీ చేయించుకుంటున్నారు.. సో ఆయన నటిస్తున్న సర్కారు వారి పాట షూటింగ్ కి బ్రేకులు అంటూ ప్రచారం జరుగుతుంది.. మరోపక్క సోషల్ మీడియాలో #GetWellSoonMaheshAnna అంటూ మహేష్ ఫాన్స్ హాష్ టాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు.

అయితే తాజాగా మహేష్ బాబు తన నీ సర్జరీ కోసం అమెరికా వెళ్ళబోతున్నాడనే న్యూస్ మొదలైంది. మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో నటిస్తున్న సర్కారు వారి పాట షూటింగ్ కి తాత్కాలికంగా బ్రేకిచ్చేసి.. ఫ్యామిలీ తో కలిసి అమెరికా వెళ్ళబోతున్నాడని.. అక్కడే మహేష్ సర్జరీ చేయించుకుని రెండు నెలల బెడ్ రెస్ట్ తర్వాత తిరిగి హైదరాబాద్ కి రానున్నాడనే న్యూస్ మొదలయ్యింది. ప్రాబ్లెమ్ చిన్నదే అయినా.. మహేష్ మాత్రం రిస్క్ తీసుకోవాలని అనుకోవడం లేదట. అందుకే అమెరికా ప్రయాణం అంటున్నారు. ఇక మహేష్ సర్కారు వారి పాట ని ఏప్రిల్ లో రిలీజ్ చేసి.. తర్వాత త్రివిక్రమ్ తో సినిమా అంటాడా.. లేదంటే రాజమౌళి తో సినిమా చేస్తాడా అనేది ఇప్పుడు మహేష్ ఫాన్స్ లో ఉన్న క్యూరియాసిటీ. 

Mahesh Babu flying to the US for surgery:

Mahesh Babu surgery: flying to the US?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ