Advertisementt

అఖండ ప్రీమియర్స్ టాక్

Thu 02nd Dec 2021 07:29 AM
balakrishna,akhanda movie,akhanda movie premiers talk,akhanda social media movie talk,balayya balakrishna akhanda movie,boyapati,pragya jaiswal,srikanth  అఖండ ప్రీమియర్స్ టాక్
Akhanda Movie Premiers Talk అఖండ ప్రీమియర్స్ టాక్
Advertisement
Ads by CJ

బాలకృష్ణ - బోయపాటి కాంబో.. అఖండ ప్రభంజనం మొదలైపోయింది. డిసెంబర్ లో ఈ ఏడాది సెకండ్ హాఫ్ లో విడుదలవుతున్న పెద్ద సినిమాగా అఖండ ఇప్పటికే రికార్డు సృష్టించగా.. ఈ తెల్లవారి ఝామునే అఖండ బెన్ఫిట్ షోతో బాలయ్య అభిమానులు కూకట్ పల్లి భ్రమరాంబిక థియేటర్ వద్ద హంగామా చేసారు. బాలకృష్ణ - బోయపాటి కాంబోలో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కిన అఖండ పై ట్రేడ్ లోనే కాదు.. ప్రేక్షకుల్లోనూ భీభత్సమైన అంచనాలున్నాయి. బాలకృష్ణ అఘోర లుక్ తోనే సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ చేసింది టీం.. మరి నేడు భారీ గా, భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన అఖండ మూవీ కి ఓవర్సీస్ లో గత రాత్రి నుండే ప్రీమియర్స్ హడావిడి మొదలైపోయింది. ఓవర్సీస్ లోను అఖండ భారీ గా రిలీజ్ అయ్యింది. అఖండ ప్రీమియర్స్ షో టాక్ మీ కోసం.. 

అఖండ అంటూ బాలయ్య గర్జించడం, ఫాన్స్ కి పూనకాలు రావడమే అంటున్నారు.. సినిమా చూసిన ప్రేక్షకులు.. అఖండ ఫస్టాఫ్ అదిరిపోయిందని, మాస్ ఆడియన్స్‌ కి ఎం కావాలో అవన్నీ అఖండ లో పుష్కలంగా ఉన్నాయని, ఫాన్స్ మెచ్చేలా కిక్కిస్తూ బోయపాటి తన మార్క్ స్పష్టంగా చూపించారని అంటున్నారు. ఇక అఖండ సెకండాఫ్ విషయానికి వస్తే అంతకుమించిన మాస్ ఎలిమెంట్స్‌తో అద్భుతంగా వచ్చిందని చెబుతున్నారు. ఎప్పటిలాగే బాలకృష్ణ హోల్ అండ్ సోల్ పర్‌ఫార్‌మెన్స్ చూపించగా.. అఘోర పాత్ర స్క్రీన్ మీద కనిపిస్తున్నంత సేపు ఆ పాత్ర హైలెట్ అవుతూనే ఉంది అని, సినిమాకి మెయిన్ అట్రాక్షన్ అఘోర పాత్రే అని, హీరోయిన్ ప్రజ్ఞా జైస్వాల్, జగపతి బాబు, శ్రీకాంత్‌లు తమ తమ పాత్రలకు న్యాయం చేశారని అంటున్నారు.

అఖండ సినిమాకి మెయిన్ హైలైట్స్ లో థమన్ బ్యాగ్ రౌండ్ మ్యూజిక్ ఒకటి అని, సినిమాటోగ్రఫీ ఓ లెవల్లో ఉంది అని, ద్వారకా క్రియేషన్స్ నిర్మాణ విలువలు మెయిన్ హైలైట్స్ లో ఒకటిగా నిలిచాయని, బాలకృష్ణ చెప్పే డైలాగ్స్ చూస్తూ నందమూరి ఫ్యాన్స్ థియేటర్స్‌లో గోల పెట్టేస్తున్నారని.. ఈలలు, విజిల్స్ తో థియేటర్స్ దద్దరిల్లిపోయింది అంటున్నారు.. మొత్తానికి అఖండ మూవీ కంప్లీట్ మాస్ ప్యాకేజ్ అంటూ సినిమా చూసిన వారి ట్వీట్స్ తో సోషల్ మీడియాలో బాలయ్య ఫాన్స్ హడావిడి కనబడుతుంది. 

Akhanda Movie Premiers Talk:

Balakrishna Akhanda Movie Premiers Talk

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ