Advertisementt

అల్లరి బాలయ్య - కామెడీ బ్రహ్మి కలిసి..

Wed 01st Dec 2021 07:47 PM
balakrishna,unstoppable,nbk,unstoppable with nbk,aha vidoes,brahmanandam,anil ravipudi  అల్లరి బాలయ్య - కామెడీ బ్రహ్మి కలిసి..
Unstoppable With NBK Ep 3 Premieres Dec 3rd అల్లరి బాలయ్య - కామెడీ బ్రహ్మి కలిసి..
Advertisement
Ads by CJ

బాలకృష్ణ ఎక్కడైనా, ఎప్పుడైనా ఎంతో హుషారుగా అల్లరి చేస్తూ చిన్నపిల్లాడిలా మారిపోయి ఎంజాయ్ చేస్తారు. అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అర్జున్ పక్కనే ఉన్నా బాలయ్య చేసిన అల్లరికి అందరూ ఫిదా అయ్యారు. ఇక ఆహా ఓటిటి కోసం అన్ స్టాపబుల్ టాక్ షో లో బాలకృష్ణ రచ్చ, ఆయన అల్లరి హైలెట్ అనేలా ఉన్నాయి. చాలా ఎనర్జిటిక్ గా బాలయ్య హోస్ట్ గా మొదలైన అన్ స్టాపబుల్ షో లో మొదటగా మోహన్ బాబు రాగా.. సెకండ్ ఎపిసోడ్ కి నాని వచ్చాడు. నాని తో కలిసి బాలయ్య చేసిన అల్లరి కి ఆ ఎపిసోడ్ కి మంచి వ్యూస్ వచ్చాయి. నాని తో బాలయ్య చేసిన హడావిడి ఆ షోపై మరింతగా అంచనాలు పెంచేసాయి. ఇక మూడో ఎపిసోడ్ కి కొద్దిగా గ్యాప్ ఇచ్చినా.. మళ్ళీ ఎంతో ఎనర్జీతో బాలకృష్ణ చేతికి బెల్ట్ తో వచ్చేసారు. వారం వారం రావడానికి నేనేమి సీరియల్ ని కాదు.. అన్ స్టాపబుల్ అంటూ వచ్చేసారు.

మూడో ఎపిసోడ్ కి బాలకృష్ణ తో స్టేజ్ మీదకి వచ్చింది ఎవరో తెలుసా.. కమెడియన్ బ్రహ్మానందం.. కామెడీ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గూడు కట్టుకున్న బ్రహ్మానందం.. ఈమధ్యన సినిమాలు తగ్గించినా.. ఆయనలో ఆ కామెడీ యాంగిల్, ఆ ఎనేర్జి ఏ మాత్రం తగ్గలేదు.. రీసెంట్ గానే అలీ తో సరదాగా షో లో హడావిడి చేసిన బ్రహ్మానందం బాలయ్య అన్ స్టాపబుల్ షో కి హాజరు కాబోతున్నట్లుగా ప్రకటించారు. అంతేకాకుండా బాలయ్య తో సినిమా చెయ్యబోయే కామెడీ డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా బ్రహ్మి తో పాటుగా అన్ స్టాపబుల్ కి హాజరయ్యారు.

ఆహా అన్ స్టాపబుల్ స్టేజ్ పై బ్రహ్మి - బాలయ్య లతో పాటుగా అనిల్ రావిపూడి చెలరేగిపోయి అల్లరి చేసారు. ప్రస్తుతం ఆహా నుండి రిలీజ్ అయినా అన్ స్టాపబుల్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మరి అల్లరి బాలయ్య - కామెడీ బ్రహ్మి కలిసిన ఈ ఎపిసోడ్ 3 ఆహా వీడియోస్ లో డిసెంబర్ 3 న ప్రీమియర్ కాబోతుంది. 

Unstoppable With NBK Ep 3 Premieres Dec 3rd :

Unstoppable With NBK Ep 3 Premieres Dec 3rd on AHA Vidoes 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ