ఈమధ్యనే అమెరికా వెళ్లి వచ్చిన కమల్ హాసన్ కోవిడ్ బారిన పడి చెన్నై లోని శ్రీరామచంద్ర ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. యుఎస్ ట్రిప్ ముగించుకుని చెన్నై కి వచ్చిన కమల్ హాసన్ ఆరోగ్యం పాడయ్యి.. దగ్గు వస్తుండడంతో.. ఆయన తక్షణమే కరోనా టెస్ట్స్ చేయించుకోగా.. కమల్ హసాన్ కి కరోనా గా నిర్ధారణ అయినా వెంటనే ఆయన చెన్నై లోని శ్రీరామచంద్ర ఆస్పత్రి లో జాయిన్ అయ్యారు. తాజాగా కమల్ హాసన్ హెల్త్ బులిటెన్ రిలీజ్ చేశారు శ్రీరామచంద్ర ఆస్పత్రి వర్గాలు. ఆ హెల్త్ బులిటెన్ లో కమల్ హాసన్ స్వల్ప కోవిడ్ లక్షణాలతో నవంబర్ 22 న శ్రీరామచంద్ర ఆస్పత్రి లో జాయిన్ అయ్యారు.
ప్రస్తుతం కమల్ హాసన్ పూర్తిగా కోలుకున్నారు.. కరోనా నెగెటివ్ వచ్చినప్పటికీ.. మరో రెండు రోజుల పాటు కమల్ హాసన్ మా ఆసుపత్రిలోనే డాక్టర్స్ అబ్జర్వేషన్ లో ఉంటారు.. డిసెంబర్ 3 న కమల్ హాసన్ ని డిశ్చార్జ్ చేస్తామని, ఆ తర్వాత రోజు నుండే కమల్ హాసన్ ఎప్పటిలాగే తన పనులు తాము చేసుకోవచ్చు అంటూ చెప్పడంతో కమల్ హాసన్ ఫాన్స్ లో ఆనందం వెల్లువెత్తింది.