Advertisementt

బిగ్ బాస్ 5: విలన్ ని చెయ్యడానికి రెడీగా ఉంటావ్

Wed 01st Dec 2021 03:47 PM
sunny,bigg boss telugu,bigg boss,siri,shanmukh,bigg boss 5  బిగ్ బాస్ 5: విలన్ ని చెయ్యడానికి రెడీగా ఉంటావ్
Bigg Boss 5: Sunny vs Siri బిగ్ బాస్ 5: విలన్ ని చెయ్యడానికి రెడీగా ఉంటావ్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 5 పదమూడవ వారంలో టికెట్ టు ఫినాలే టాస్క్ మొదలైంది. టాప్ 5 లోకి మొదట ఎవరు వెళ్ళబోతున్నారో ఈ టికెట్ టు ఫినాలే టాస్క్ తేల్చేస్తుంది. ఏడుగురు హౌస్ మేట్స్ ఐస్ ట్యూబ్స్ ఉన్న టబ్ లో నించుని తమ బాల్స్ కాపాడుకోవాల్సి ఉంటుంది. అందులో హౌస్ మేట్స్ అంతా హుషారుగా పార్టీస్పెట్స్ చేసినా.. సన్నీ కి సిరికి మధ్యన పెద్ద గొడవే జరిగింది. సన్నీ బాల్స్ సిరి తోసేసింది. నా కాలు ఐస్ ట్యూబ్స్ లోనే ఉన్నాయి అని సన్నీ అన్నాడు.. కోపం వచ్చిన సన్నీ సరే మీరే ఆడుకోండి భాయ్ నేను ఇక ఆడనురా భాయ్ అన్నాడు. ఇక షణ్ముఖ్ - సన్నీ ప్లేస్ లు మార్చుకున్నారు. తర్వాత సన్నీ సిరి బాల్స్ పడేసాడు.

నా కాళ్ళు ఐస్ ట్యూబ్స్ లోనే ఉన్నాయని సిరి అంది.. అంతలో షణ్ముఖ్ కూడా సిరి కాళ్ళు ఉన్నాయన్నాడు.. నేను నీతో మాట్లాడడం లేదు సిరితో మాట్లాడుతున్నా అన్నాడు సన్నీ.. ఎప్పుడూ నా గేమ్ పాడు చేస్తావ్.. నువ్వే నన్ను విలన్ ని చెయ్యడానికి ఫస్ట్ ఉంటావా అంటూ సన్నీ అరిచేసాడు. సిరి ఏడ్చుకుంటూ కూర్చుంది. శ్రీరామ్ రా సన్నీ నాదగ్గర బాల్స్ గుంజుకో అన్నాడు.. నా బాల్స్ ఉన్నాయ్ డార్లింగ్.. నీ బాల్స్ గుంజుకోవాలి అంటే గుంజుకుంటాను.. బారా బర్ గుంజుకుంటాను అన్నాడు సన్నీ. నేను ఎవ్వరి జోలికి వెళ్ళలేదు.. నువ్వే ఫస్ట్ నాతో పెట్టుకుంటావా అంటూ సన్నీ సిరిని అరిచేసాడు. ఇక సన్నీ ఒక్కడే మాట్లాడుకుంటూ.. అందరూ కాళ్ళు ప్రాబ్లెమ్ అంటారు.. అందరికి తెలుసు ఐస్ గెడ్డల్లో కాళ్ళు పెడితే.. హమ్ అంటారు.. అలాగే బాల్స్ బాక్స్ ఉన్న దగ్గర సన్నీ కామెడీ చేస్తూ సిరి టబ్ దగ్గరికి వెళ్లి నువ్ ఏం గేమ్ ఆడతావ్ నీకే అర్ధం కాదు.. కానీ విలన్ ని చెయ్యడానికి ఫస్ట్ కూర్చుంటావ్ అంటూ తనలో తానే మాట్లాడుకుంటున్నాడు.. ఇది ఈ రోజు ప్రోమో హైలైట్స్.

Bigg Boss 5: Sunny vs Siri:

Bigg Boss Telugu 5 new Promo highlights

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ