బిగ్ బాస్ సీజన్ 5 లో ట్రాన్స్ జెండర్ గా అడుగుపెట్టిన ప్రియాంక సింగ్.. మానస్ తో క్లోజ్ గా ఉంటూ.. మానస్ కి సేవలు చెయ్యడం అంటే.. ఫుడ్ పెట్టడం, అతనికి దెబ్బలు తగిలితే సేవలు చెయ్యడం ఇలా ప్రియాంక మానస్ చుట్టూ తిరుగుతూ బిగ్ బాస్ కి కంటెంట్ ఇచ్చేసారు. ప్రియాంక మానస్ ని ప్రేమిస్తున్నట్టుగా చూపిస్తున్నారు. మానస్ మాత్రం ప్రియాంక విషయంలో మొదటి నుండి అంటీముట్టనట్టుగానే ఉన్నాడు. కానీ ప్రియాంక సేవలు చేస్తున్నప్పుడు అతను అవాయిడ్ చెయ్యాల్సింది కానీ చెయ్యలేదు. మానస్ ఫ్రెండ్ షిప్ అనుకుంటే.. ప్రియాంక మాత్రం అంతకు మించి ఫీలవుతుంది అనే విషయాన్ని నాగార్జున మానస్ కి వీడియో వేసి చూపించాడు.
అప్పటినుండి మానస్ ప్రియాంకని అవాయిడ్ చేస్తుంటే.. పింకీ తట్టుకోలేకపోతుంది. ఇక నిన్న రాత్రి అంటే మంగళవారం రాత్రి ఎపిసోడ్ ప్రియాంక మానస్ గొడవపడ్డారు. మానస్ ప్రియాంక మొహం మీద నువ్ నాకు నచ్చలేదు, నువ్వంటే ఇష్టం లేదు అని పదే పదే అన్నాడు. మధ్యలో కాజల్ ప్రియాంక కలిసి గొడవపడ్డారు. ఆ గొడవనే బిగ్ బాస్ హైలెట్ చేసాడు. మానస్ తో ప్రియాంక మాట్లాడమనుకున్నా మానస్ ఛాన్స్ ఇవ్వలేదు.. ఇక కాజల్, మానస్ లు ఫుడ్ తింటూ ప్రియాంక చాలా సీన్ చేస్తుంది అని మాట్లాడుకున్నారు.
ప్రియాంక తప్పు ఉండబట్టే ఆమె సిస్టర్ మానస్ కి సారి చెప్పింది అంటూ కాజల్ మానస్ తో అంది.. ఆ విషయం లో ప్రియాంక కాజల్ మళ్ళీ గొడవ పడ్డారు. ఇక ప్రియాంక బాధపడుతుంటే.. మానస్ వెళ్లి హగ్ చేసుకుని ఓదార్చాడు.. ఇప్పుడు చెప్పండి.. అక్కడ మానస్ ది తప్పా.. లేదంటే ప్రియాంక ది తప్పా..