టాలీవుడ్ కి దశాబ్దాల పాటు సేవలందించిన ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆకస్మిక మరణం టాలీవుడ్ ప్రముఖులనే కాదు.. పొలిటికల్ లీడర్స్, ప్రధాని మోడీ, రెండు తెలుగు రాష్ట్రాల సీఎం లని, అందరినీ కలచి వేస్తోంది. మంగళవారం సాయంత్రం సిరివెన్నెల కిమ్స్ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మరణించారు. ప్రస్తుతం ఆయన భౌతికకాయం ఇంకా హైదరాబాదులోని కిమ్స్ ఆసుపత్రిలోనే ఉంది. ఈ రాత్రికి అక్కడే ఉంటుంది. రేపు ఉదయం 7 గంటలకు పార్థివదేహాన్ని జూబ్లీహిల్స్ లోని ఫిలింఛాంబర్ కు తరలిస్తారు.
సిరివెన్నెల మరణవార్త విని.. మెగాస్టార్ చిరు దగ్గరనుండి, దర్శకుడు క్రిష్.. ఇంకా చాలామంది టాలీవుడ్ ప్రముఖులు కిమ్స్ హాస్పిటల్ కి చేరుకొని.. సిరివెన్నెల కుటుంబ సబ్యులని ఓదార్చారు.
ఇక సిరివెన్నెల పార్థివదేహాన్ని ఫిలిం ఛాంబర్ లో అభిమానుల సందర్శనార్థం ఉంచుతారు. అనంతరం మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున మంత్రి పేర్ని నాని సిరివెన్నెల సీతారామశాస్త్రి అంత్యక్రియలకు హాజరుకానున్నారు.