బిగ్ బాస్ సీజన్ 5 13 వారం నామినేషన్స్ ప్రక్రియ గరం గారంగానే జరిగింది. షణ్ముఖ్, సన్నీ తప్ప మిగతా ఐదు మంది హౌస్ మేట్స్ సిరి, శ్రీరామ చంద్ర, మానస్, ప్రియాంక, కాజల్ లు నామినేషన్స్ లోకి వెళ్లారు. ఇక ఆదివారం రవి ఎలిమినేషన్స్ తర్వాత హౌస్ మేట్స్ లో రకరకాల ప్రశ్నలు.. ఎలాగో సేవ్ అయ్యాను.. టాప్ 5 లో ఉండాలన్నది నా కోరిక అంటూ కాజల్ మానస్ దగ్గర చెప్పుకుంది ఇక ప్రియాంక మానస్ విషయంలో మదనపడింది. మానస్ మాత్రం ప్రియాంక తో నా ట్రాక్ బయట ఎలా వెళ్లిందో అనే టెంక్షన్ లో ఉన్నాడు. అలాగే ప్రియాంక తో మాట్లాడితే ఓకె.. టచ్ చేస్తే ఆ అమ్మాయి వేరే ఫీలింగ్స్ తీసుకుంటుంది అన్నాడు మానస్. రెండు రోజులుగా ప్రియాంక తో మాట్లాడడం లేదు.. నువ్ చూసుకో అంది కాజల్.. కానీ మానస్ మాత్రం ప్రియాంక ని టచ్ చేసి ఆమెలో ఎక్కువగా ఆశలు రేపలేను అంటూ ఫీలవుతున్నాడు.
మరో పక్క సిరి, షణ్ముఖ్ లు రవి ఎందుకు ఎలిమినేట్ అయ్యాడో తెలియక మదన పడుతున్నారు. అయితే సిరి లేచి హాగ్ అడిగితే.. వద్దు కూర్చో అన్నాడు షణ్ముఖ్.. లేరా అంది.. షణ్ముఖ్ భయపడుతూ అమ్మో మళ్ళీ మీ అమ్మగారొచ్చేస్తారు అన్నాడు. సిరి మాత్రం అది ఎప్పుడో అయ్యిపోయింది అంది.. ఇక సిరి హగ్ ఇచ్చినా షణ్ముఖ్ చాలా ఇబ్బంది పడ్డాడు. ఇక హగ్ తర్వాత కెమెరాలతో మట్లాడుతూ షణ్ముఖ్ అండ్ సిరులు ఇది కేవలం ఫ్రెండ్ షిప్ మాత్రమే ఫ్రెండ్ షిప్ ఓన్లీ అంటూ చెప్పుకున్నారు. మానస్ ప్రియాంక విషయంలో భయపడితే.. షణ్ముఖ్ మాత్రం సిరి మదర్ విషయంలో ఎంతగా టెంక్షన్ పడుతున్నాడో.. గత రాత్రి ఎపిసోడ్ లో చూపించారు.