Advertisementt

డిసెంబర్2 అఖండ - డిసెంబర్3 ఆర్.ఆర్.ఆర్

Mon 29th Nov 2021 04:15 PM
december,akhanda movie,akhanda release,rrr movie,rrr trailer release,rajamouli,balakrishna  డిసెంబర్2 అఖండ - డిసెంబర్3 ఆర్.ఆర్.ఆర్
December 2 Akhanda Release - December 3 RRR Trailer Release డిసెంబర్2 అఖండ - డిసెంబర్3 ఆర్.ఆర్.ఆర్
Advertisement
Ads by CJ

భారీ అంచనాలు నడుమ డిసెంబర్ 2న బాలకృష్ణ - బోయపాటి కాంబోలో తెరకెక్కిన మాస్ ఎంటర్టైనర్ అఖండ మూవీ రిలీజ్ కాబోతుంది. కరోనా పాండమిక్ సిట్యువేషన్ తర్వాత విడుదలవుతున్న భారీ బడ్జెట్ చిత్రంగా అఖండ నిలుస్తుంది. క్రేజీ మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో, ట్రేడ్ లో భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతం ప్రమోషన్స్ లో దూసుకుపోతున్న అఖండ రిలీజ్ కోసం ఫాన్స్ మాత్రమే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు వెయిటింగ్. ఇక ఇప్పుడు డిసెంబర్ 3న మరో జాతర మొదలవుతుంది.

అదే పాన్ ఇండియా ఫిలిం ఆర్.ఆర్.ఆర్ నుండి పాన్ ఇండియా లెవల్లో ట్రైలర్ ని రిలీజ్ చెయ్యబోతున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కిన క్రేజీ పాన్ ఇండియా మల్టీస్టారర్ మూవీ జనవరి 7 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కి సిద్దమవగా.. ప్రమోషన్స్ లో భాగంగా వారానికో అప్ డేట్ తో రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ పై అంచనాలు పెంచుతున్నారు. ఇక ఇప్పటికే ఎన్టీఆర్, రామ్ చరణ్ లపై విడివిడిగా టీజర్స్, ఆర్.ఆర్.ఆర్ గ్లిమ్ప్స్ ని రిలీజ్ చేసిన రాజమౌళి డిసెంబర్ 3 న ఆర్.ఆర్.ఆర్.ఆర్ ట్రైలర్ ని వదలబోతున్నట్టుగా ఆర్.ఆర్.ఆర్ మేకర్స్ ప్రకటించారు. డిసెంబర్ 2 న బాలయ్య అఖండ థియేటర్స్ దగ్గర రచ్చ చెయ్యడానికి రెడీ అవుతుంటే.. డిసెంబర్ 3 న ఆర్.ఆర్.ఆర్ ట్రైలర్ సోషల్ మీడియా ని ఊపెయ్యబోతుంది. 

December 2 Akhanda Release - December 3 RRR Trailer Release:

RRR Trailer On Dec 3rd

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ