Advertisementt

బిగ్ బాస్ 5: ఈ వారం నామినేషన్స్ లిస్ట్

Mon 29th Nov 2021 02:36 PM
bigg boss 5,bigg boss telugu,bigg boss,13th week nominations heat,siri,srirama chandra,manas,kajal,priyanka  బిగ్ బాస్ 5: ఈ వారం నామినేషన్స్ లిస్ట్
Bigg Boss 5: 13th Week Nominations Heat బిగ్ బాస్ 5: ఈ వారం నామినేషన్స్ లిస్ట్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 5 చివరి మూడు వారాల్లో ఎవరు నామినేషన్స్ లోకి వెళతారు, ఎవరు ఈ రెండు వారాల్లో ఎలిమినేట్ అవుతారు, ఎవరు టాప్ 5 లో ఉంటారు.. అవే ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకుల మదిలో మెదులుతున్న ప్రశ్నలు. ఇప్పటికే 12 వారాల బిగ్ బాస్ జర్నీలో 12 మంది కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యి ఇళ్ళకి వెళ్లిపోయారు. అందులో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అయిన శ్వేతా, రవి, విశ్వాలు కూడా ఉన్నారు. ఇక మిగిలిన ఏడుగురు హౌస్ మేట్స్ లో ఈ వారం నామినేషన్స్ లోకి ఎవరు వెళ్లారో అనేది ఈ రోజు రాత్రి ఎపిసోడ్ లో తెలియాల్సి ఉండగా.. బిగ్ బాస్ లీకులు ఈ రోజు ఉదయానికే సోషల్ మీడియాలో పాకేసాయి.

ఈ వారం నామినేషన్ హీట్ మాములుగా లేదు. కాజల్ ని షణ్ముఖ్ నువ్ ఉంటే హౌస్ లో గొడవలు, నువ్వు వెళ్ళిపోతే.. గొడవలు తగ్గుతాయనే నా స్టేట్మెంట్ కరెక్ట్ అన్నాడు.. నువ్ వెధవవి అని నువ్ ఫీల్ అయ్యావ్ నేను అవ్వలేదు అంది కాజల్. ఇక పింకీ నేను నామినేట్ చేయడానికి ఏ రీజన్ లేదు అంది.. అలా కుదరదని షణ్ముఖ్ అంటే.. నువ్ ఉంటే నిన్నే నామినేట్ చేసేదానిని అంది.. కానీ అలా కుదరదు ఏదో ఒక డెసిషన్ తీసుకో అనగా.. సన్నీ అదిగో ఆమె మొహం కడుక్కోలేదు ఆమెని చెయ్యి, మానస్ నీతో రెండు రోజులుగా మాట్లాడ్డం లేదు ఆయన్ని నామినేట్ చెయ్యి అనగా.. ఇది కామెడీ కాదు  నామినేషన్స్ అని షణ్ముఖ్ అన్నాడు. దానితో ప్రియాంక ఇది మీకు చివరి అవకాశం మీరు ఎవరినీ నామినేట్ చెయ్యకపోతే.. మీరు డైరెక్ట్ గా నామినేట్ అవుతారు అన్న ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఇక బిగ్ బాస్ లీకుల ద్వారా ఈ వారం షణ్ముఖ్ కెప్టెన్ గాను, సన్నీ నామినేషన్స్ నుండి తప్పించుకోగా.. మానస్, కాజల్, సిరి, ప్రియాంక, శ్రీరామ చంద్రలు నామినేట్ అయ్యారని తెలుస్తుంది. మరి ఈ వారం హౌస్ నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారో అనేది చూడాలి.

Bigg Boss 5: 13th Week Nominations Heat:

Bigg Boss Telugu 5: 13th Week Nominations list

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ