బిగ్ బాస్ సీజన్ 5 లో టైటిల్ ఫెవరెట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన యాంకర్ రవి.. అనూహ్యంగా 12 వ వారంలో ఎలిమినేట్ అవడం ఆయన ఫాన్స్ కే కాదు.. ఆయనకి షాకింగ్ గానే ఉంది. రవి ఎలిమినేట్ అయ్యి.. స్టేజ్ పై ఉండి.. హౌస్ మేట్స్ తో మాట్లాడిన తర్వాత.. స్టార్ మా బుజ్ లో అరియనా తో ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అసలు తాను ఈ వారం ఎలిమినేట్ అవుతాను హౌస్ మేట్స్ మాత్రమే కాదు.. ఎవరూ ఊహించలేదు అని చెప్పిన రవి.. మానస్ - సన్నీ ల స్నేహం గురించి, సిరి - షణ్ముఖ్ ల బంధం గురించి మాట్లాడాడు. అంతేకాకుండా అందరూ అన్నట్టుగా తాను ఎవరిని ఇంఫ్లుయెన్స్ చెయ్యలేదు అని, అలా అయితే అది వాళ్ళ ఖర్మ అన్నట్టుగా మాట్లాడాడు.
అయితే మానస్ సన్నీ ని ఫ్రెండ్ గా ఎంతగా సపోర్ట్ చేస్తాడో.. ఫ్రెండ్ తప్పు చేసినప్పుడు వారించాల్సింది పోయి ఎంకరేజ్ చేస్తాడు అని చెప్పాడు. నటనరాజ్ మాస్టర్ మైండ్‌లో ఏదో పెట్టుకొని ఇంటిలోపలికి అడుగుపెట్టారు. షణ్ముఖ్.. మొదటి నుండి గేమ్ ఆడినట్లు అస్సలు నాకు కనిపించలేదు. ఇక ప్రియాంక మానస్ పై ఎంతగా ప్రేమ చూపించినా.. మానస్ అందులో సగం కూడా పింకీపై ప్రేమ చూపించడు అంటూ సెన్సేషనల్ గా మాట్లాడాడు. అంతేకాకుండా సిరి - శ్రీహన్ ని ఎంతగా ఇష్టపడుతుందో.. షణ్ముఖ్ - దీప్తికి మధ్యన ఎంత ప్రేమ ఉందొ.. సిరి - షణ్ముఖ ల మధ్యన కూడా అదే ఉంది అనిపిస్తుంది.. అదే విషయం సిరి కూడా చెప్పింది. సిరి - షణ్ముఖ్ మధ్య ఎలాంటి కనెక్షన్ ఉందో తెలీదు. కానీ సిరి మాత్రం చాలా సార్లు షణ్ముఖ్‌ని ఇష్టపడుతున్నట్లు చెప్పింది.. అంటూ సిరి - షణ్ముఖ్ బంధం గురించి రవి సెన్సేషనల్ గా మాట్లాడాడు.