టాలీవుడ్ లో పెద్ద సినిమాల జాతర మొదలుకాబోతుంది. అఖండ తో బాక్సాఫీసు దగ్గర బోణి కొడుతున్న బాలకృష్ణ చేతిలో ఇప్పుడు టాలీవుడ్ భవితవ్యం అన్నట్టుగా ఉంది. కరోనా క్రైసిస్ తర్వాత అన్ని చిన్న సినిమాలు, మీడియం బడ్జెట్ మూవీస్.. రిలీజ్ అయ్యాయి. సో ప్రేక్షకులు అటు ఇటుగా వచ్చినా.. హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాలు మంచి కలెక్షన్స్ రాబట్టాయి. ఇక ఇప్పుడు పెద్ద సినిమాలను ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో అనేది అఖండ రిలీజ్ తర్వాత తెలుస్తుంది. అయితే ఇలాంటి సమయంలో ఏపీ ప్రభుత్వం టాలీవుడ్ పై బండరాయి వేసింది. అఖండని టార్గెట్ చెయ్యడమే కాదు.. పెద్ద సినిమాల నిర్మాతలను టార్గెట్ చేసి మరీ టికెట్ రేట్స్, షోస్ విషయంలో కఠిన చట్టాలు తీసుకు వచ్చింది. పెద్ద సినిమాలకు ఆరేడు షోస్, బెన్ఫిట్ షోస్ హడావిడీ లేకపోతె అనుకున్న బడ్జెట్ వర్కౌట్ అవ్వదు. మరోపక్క టికెట్ రేట్స్ కూడా అంతే. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం చట్టాలు చేసింది.
సినిమా ఇండస్ట్రీ నుండి మెగాస్టార్ తప్ప మరెవ్వరూ ఈ విషయమై స్పందించకుండా వెయిట్ చేస్తూ కామ్ గా వున్నారు. పెద్ద నిర్మాతలు మరోసారి జగన్ ని కలవాలని ప్రయత్నాల్లో ఉన్నారని అంటున్నారు. చిరంజీవి, నాగార్జున, సురేష్ బాబు, దిల్ రాజు, దానయ్య, రాజమౌళి, అల్లు అరవింద్ లాంటి పెద్దలు ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరపాలని దాని కోసం తగిన టైం కోసం చూస్తున్నారు. మరి అఖండ రిలీజ్ దగ్గరకొచ్చేసింది. ఇంకా కామ్ గా, సైలెంట్ గా మౌనంగా ఉంటే కష్టం.. అసలు ఈ మౌనం దేనికి సంకేతమో అర్ధం కావడం లేదు. మరి ఈ విషయంలో టాలీవుడ్ ఏ నిర్ణయం తీసుకుంటుందో అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.