హైదరాబాద్ నడిబొడ్డున అన్నపూర్ణ స్టూడియోస్ లో బిగ్ బాస్ సెట్ వేసి.. స్టార్ మా యాజమాన్యం.. ఎంతో గ్రాండ్ గా 105 రోజుల పాటు బిగ్ బాస్ కార్యకమాన్ని నిర్వహిస్తుంది. ఇక బిగ్ బాస్ నాలుగు సీజన్స్ సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకోగా.. బిగ్ బాస్ సీజన్ 5 ప్రస్తుతం రన్నింగ్ లో ఉంది. అయితే సీజన్ 5 ఎలిమినేషన్స్ ప్రక్రియలో గందరగోళం జరుగుతుంది అంటూ 12 వ వారం హౌస్ నుండి ఎలిమినేట్ అయిన యాంకర్ రవి అభిమానులు అన్నపూర్ణ స్యుడియోస్ గేటు దగ్గర ఆందోళన చెయ్యడం హాట్ టాపిక్ గా మారింది. ఈ ఎలిమినేషన్ ప్రక్రియ పారదర్శకంగా జరగడం లేదు అంటూ రవి ఫాన్స్ ఆందోళన చేపట్టారు.
శనివారం ఎపిసోడ్ లో సన్నీ, సిరి, శ్రీరామ్ లు సేవ్ అవ్వగా.. ఆదివారం ఎపిసోడ్ లో కాజల్, ప్రియాంక, యాంకర్ రవి లలో రవి ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ ని వీడడం ఆయన ఫాన్స్ తట్టుకోలేకపోతున్నారు. తెలంగాణ అభ్యర్థులకు బిగ్ బాస్ లో న్యాయం జరగడం లేదు అంటూ యాంకర్ రవి అభిమానులు స్టూడియో ఎదుట న్యాయం కావాలి అంటూ ఆందోళన చేపట్టారు. బిగ్ బాస్ హౌస్ లో తెలంగాణ వారికి అన్యాయం అంటూ రవి ఫాన్స్ అరుస్తూ గందరగోళం సృష్టించారు.