Advertisementt

అందరూ విన్నర్ అంటుంటే.. ఈ ఇన్సిడెంట్ తో..

Sun 28th Nov 2021 05:59 PM
sunny,anchor ravi,bigg boss,bigg boss telugu telugu  అందరూ విన్నర్ అంటుంటే.. ఈ ఇన్సిడెంట్ తో..
Sunny decided the fate of Anchor Ravi in the Bigg Boss 5 అందరూ విన్నర్ అంటుంటే.. ఈ ఇన్సిడెంట్ తో..
Advertisement
Ads by CJ

ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ అంటూ అందరూ సన్నీ నే ఫిక్స్ అవుతున్నారు. మధ్యలో కాస్త డల్ అయినా.. తర్వాత సన్నీ మళ్ళీ మంచి ఎంటర్టైనర్ గా ఫామ్ లోకి వచ్చేసాడు. ఇక తాజాగా హౌస్ మేట్స్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అంతా.. టాప్5 లో ఎవరుంటారంటే.. అందరూ ముందుగా సన్నీ పిక్ నే పెట్టడం, బయట కూడా సన్నీ కి ఫ్యాన్ ఫాలింగ్ పెరిగి బిగ్ బాస్ విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని, అసలైతే షణ్ముఖే విన్నర్ అని అందరూ ముందులో ఫిక్స్ అయినా.. తర్వాత తర్వాత షణ్ముఖ్ గ్రాఫ్ పడిపోవడంతో.. సన్నీ రేంజ్, క్రేజ్ పెరిగాయి.

అంతా బాగానే ఉంది.. కానీ ఇప్పుడు సన్నీ చేసిన ఓ పని వల్ల అతను తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. కేవలం ఫ్రెండ్ ని సేవ్ చెయ్యడం వలన సన్నీ హౌస్ లోని స్ట్రాంగ్ కంటెస్టెంట్ ని బయటికి పంపెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. డేంజర్ జోన్ లో ఉండాల్సిన ప్రియాంకని తప్పించి ఆ ప్లేస్ లో యాంకర్ రవి ని నించోబెట్టడం, అలాగే మరో కంటెస్టెంట్ గా కాజల్ ఎలిమినేషన్స్ లో ఉండడంతో.. నాగార్జున సన్నీని పిలిచి నీ కోసం, లేదా ఎవరి కోసమైనా ఎవిక్షన్ ఫ్రీ పాస్ వాడొచ్చు అనగానే సన్నీ ఆలోచించాడు. సన్నీ అలోచించి వాడు అంటూ షణ్ముఖ్ సలహా ఇచ్చాడు. తనకి ఈ పాస్ రావడానికి కారణమైన కాజల్ ని ఈ ఫ్రీ పాస్ వాడి సేవ్ చేసాడు సన్నీ. దానితో రవి ఎలిమినేట్ అయ్యాడు. 

అక్కడ ఫ్రెండ్ షిప్ కె సన్నీ వాల్యూ ఇచ్చాడు.. దాని వలన స్ట్రాంగ్ కంటెస్టెంట్, టాప్ 5 అనుకున్న కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యాడు. దానితో సన్నీ చేసిన పనికి అందరూ ట్రోల్ చేస్తున్నారు. 

Sunny decided the fate of Anchor Ravi in the Bigg Boss 5:

Sunny eviction free pass to eliminate either Ravi or Kajal today

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ