ఈమధ్యనే కోరుకున్న, ఇష్టపడిన ప్రియసఖి లోహిత రెడ్డి ని పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడైన కార్తికేయ రీసెంట్ చిత్రం రాజా విక్రమార్క సినిమా 2 కోట్ల నష్టాలను మిగిల్చింది. రెండు వారాల క్రితం మంచి అంచనాలతో చిరు టైటిల్ తో విడుదలైన రాజా విక్రమార్క మూవీకి నెగటివ్ టాక్ రావడంతో.. సినిమానికి భారీ లాస్ వచ్చేసింది నిర్మాతలకు. రాజా విక్రమార్కని 4.3 కోట్లకు అమ్మెయ్యగా.. ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ 2.33 కోట్లు షేర్ మాత్రమే షేర్ రావడంతో.. 2.17 కోట్ల నష్టాలూ చవిచూడాల్సి వచ్చింది. దానితో కార్తికేయ ఖాతాలో మరో డిజాస్టర్ పడినట్లయింది. వరస ప్లాప్స్ తో కార్తికేయ కి రాజా విక్రమార్క అయినా హెల్ప్ చేస్తుంది అనుకుంటే..ఈ సినిమా కూడా నిరాశనే మిగిల్చింది.
ఏరియా - కలెక్షన్స్ (కోట్లలో)
నైజాం - 0.57
సీడెడ్ - 0.31
ఉత్తరాంధ్ర - 0.36
ఈస్ట్ గోదావరి - 0.23
వెస్ట్ గోదావరి - 0.16
గుంటూరు - 0.16
కృష్ణా - 0.21
నెల్లూరు - 0.18
ఏపీ అండ్ తెలంగాణ - 2.11 కోట్లు షేర్
ఇతర ప్రాంతాలు అండ్ ఓవర్సీస్ - 0.22
వరల్డ్ వైడ్ ఫైనల్ కలెక్షన్స్ - 2.33 కోట్లు షేర్