బిగ్ బాస్ సీజన్ 5 చివరి రెండు మూడు వారాల్లో ఫన్ బాగా జనరేట్ అయ్యింది. బిగ్ బాస్ హౌస్ లో ఫ్యామిలీ మెంబెర్స్, బిగ్ బాస్ స్టేజ్ పై లవర్స్ అంటూ బిగ్ బాస్ చివరి రెండు మూడు వారాలను ఆశక్తిగా మలుస్తున్నారు. ఇక నాగార్జున శనివారం హౌస్ మేట్స్, ఫ్రెండ్స్ తో బిగ్ బాస్ స్టేజ్ పై సందడి చెయ్యగా.. ఆదివారం సన్ డే ఫన్ డే అన్నట్టుగా హౌస్ మేట్స్ ని దించేసాడు. తాజాగా వదిలిన బిగ్ బాస్ ప్రోమోలో నాగార్జున కొన్ని ఆధారాలుగా సినిమా పేర్లని చెప్పమని.. హౌస్ మేట్స్ అందులో పోటీ పడి మరీ సినిమా పేర్లు చెప్పి ఎంజాయ్ చేస్తూ స్టెప్స్ వేశారు.
ఇక షణ్ముఖ్ అయితే జోరు జోరు జోరే పెరిగింది అంటూ సాంగ్ కి రెచ్చిపోయి డాన్స్ చేసరికి నాగార్జున కూడా షణ్ముఖ్ ఎలా గంతులు వేస్తున్నాడో చూడండి.. ఎంత ఫ్రీ గా అయ్యిపోయాడో అంటూ ఫన్ చూపించాడు. హౌస్ మేట్స్ డాన్స్ స్టెప్స్ అదిరిపోయూయి. తర్వాత కళ్ళకి గంతలు కట్టి చైర్స్ ఆట ఆడించిన నాగార్జున ఆదివారం ఎపిసోడ్ ని ఫన్ గా మార్చేసాడని.. లేటెస్ట్ ప్రోమో చూస్తే తెలుస్తుంది. ఇక ఈరోజు యాంకర్ రవి ఎలిమినేట్ అయ్యి హౌస్ ని వీడుతున్నాడు.