పవన్ కళ్యాణ్ - రానా కాంబోలో క్రేజీ మల్టీస్టారర్ గా సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తున్న భీమ్లా నాయక్ సౌండ్స్ సంక్రాంతి కి బ్లాస్ట్ అంటూ పదే పదే చెప్పారు మేకర్స్. జనవరి 12 నే భీమ్లా నాయక్ రిలీజ్ అన్నారు. నిన్నమొన్నటివరకు హడావిడి చేసిన భీమ్లా నాయక్ టీం ప్రస్తుతం చప్పుడు లేకుండా కూర్చున్నారు. అంటే సంక్రాంతికి రిలీజ్ చేస్తున్న ప్రభాస్ రాధేశ్యామ్ నుండి సాంగ్స్, అలాగే రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ నుండి సాంగ్స్ మార్కెట్ ని ఊపేస్తుంటే.. భీమ్లా నాయక్ సౌండ్స్ కాస్త తగ్గాయనిపిస్తుంది. పవన్, రానా ల వీడియోస్ ని సపరేట్ గా వదిలినిన టీం.. ఇక భీమ్లా నాయక్ టీజర్ కి రంగం చేస్తుంది అనడడమే కానీ.. అప్ డేట్ లేదు.. అందులోను ఈ మధ్యన రాజమౌళి పవన్ కళ్యాణ్ ని కలవబోతున్నారనే న్యూస్ ఉండనే ఉంది.
అంటే ఆర్.ఆర్.ఆర్ కి దారి వదలమని, భీమ్లా నాయక్ ని పోస్ట్ పోన్ చేసుకోమని రాజమౌళి పవన్ కళ్యాణ్ ని రిక్వెస్ట్ చేస్తున్నారని, అసలు రాజమౌళి - పవన్ మీటింగ్ భీమ్లా నాయక్ ని సంక్రాంతికి బరి నుండి తప్పించడానికి అనే ఊహాగానాల మధ్యన భీమ్లా నాయక్ నిజంగా సంక్రాంతికి వస్తుందా.. అనే అయోమయంలో ఫాన్స్ ఉన్నారు. భీమ్లా నాయక్ మేకర్స్ మాత్రం పదే పదే మన సినిమా జనవరి 12 నే అంటున్నారు. మధ్య మధ్యలో భీమ్లా నాయక్ హడావిడి అంటే రాధేశ్యామ్ - ఆర్.ఆర్.ఆర్ మధ్యలో కొంచెం హడావిడి చేస్తుంటే.. సినిమాకి హైప్ క్రియేట్ అవుతుంది.. అలాగే డేట్ పై కూడా క్లారిటీ వస్తుంది.. లేదంటే ఇలాంటి అనుమానాలే రేజ్ అవుతాయి.