Advertisementt

బిగ్ బాస్ 5: కాజల్ ఫ్రెండ్షిప్ రవిని బలి చేసింది

Sun 28th Nov 2021 10:49 AM
bigg boss 5,bigg boss telugu,anchor ravi,kajal,bigg boss sunday episode highlights  బిగ్ బాస్ 5: కాజల్ ఫ్రెండ్షిప్ రవిని బలి చేసింది
Bigg Boss 5: Kajal Safe - Ravi Bali బిగ్ బాస్ 5: కాజల్ ఫ్రెండ్షిప్ రవిని బలి చేసింది
Advertisement

ఆదివారం ఫన్ డే నే కాదు.. ఎలిమినేషన్ డే కూడా.. కాకపోతే ఆదివారం ఎలిమినేషన్ ఎపిసోడ్ లో మజా, ఇంట్రెస్ట్ అన్నది లేకుండా శనివారమే ఆ ఎలిమినేషన్స్ ఎపిసోడ్ లీక అయ్యి.. సోషల్ మీడియాలో ఎవరు ఎలిమినేట్ అయ్యారో అనేది తెలిసిపోవడంతో.. ఆదివారం ఎపిసోడ్ పై పెద్దగా ఆసక్తి లేకుండా పోతుంది. అయితే ఈ 12 వ వారం ఇంటి నుండి బయటికి వెళ్ళేది ఎవ్వరో అనేది నిన్న శనివారం రాత్రే తెలిసిపోయింది. శనివారం ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ ఫ్యామిలీ మెంబెర్స్, ఫ్రెండ్స్ తో బిగ్ బాస్ స్టేజ్ అదిరిపోయింది. అందులో సిరి బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్ చేసిన కామెడీ, షణ్ముఖ్ గర్ల్ ఫ్రెండ్ దీప్తి సునయన మధ్యన ఉన్న బాండింగ్ హైలెట్ అవ్వగా.. ఈ శనివారం సన్నీ, ఇంకా సిరి, శ్రీరామచంద్ర లు ఈ ఎలిమినేషన్స్ నుండి సేవ్ అయ్యారు.

ఆదివారం ఎపిసోడ్ లో కాజల్, రవి, ప్రియాంక, షణ్ముఖ్ లు ఎలిమినేషన్స్ కి రాగా.. అందులో రవి ఎలిమినేట్ అవడం హాట్ టాపిక్ అయ్యింది. అయితే మొదటి నుండి డేంజర్ జోన్ లో ప్రియాంక, కాజల్, సిరిలు ఉన్నారని చెప్పినా, సిరి ముందే సేవ్ అయ్యింది. ఇక కాజల్ - ప్రియాంక లలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారునుకుంటే.. ఇక్కడ రవి ఎలిమినేట్ అవడం చర్చనీయాంశం అయ్యింది. అయితే కాజల్ - రవి చివరి వరకు డేంజర్ జోన్ లో ఉండగా.. అక్కడ సన్నీ తన దగ్గర ఉన్న ఎవిక్షన్ పాస్ ని ఫ్రెండ్ కాజల్ ని సేవ్ చెయ్యడానికి వాడెయ్యడంతో.. రవి అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యాడు. అలా సన్నీ కాజల్ ని సేవ్ చేసి రవి ని బలి చేసాడు. పాపం రవి.

Bigg Boss 5: Kajal Safe - Ravi Bali:

Bigg Boss 5 Telugu: Sunday Episode Highlights

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement