ప్రముఖ సినీ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అనారోగ్యంతో హాస్పిటల్ లో జాయిన్ అవడంతో టాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నిన్నగాక మొన్న శివ శంకర్ మాస్టర్ కోవిడ్ తో పోరాడుతూ క్రిటికల్ కండిషన్ లోకి వెళ్లగా.. ఇప్పుడు సిరివెన్నెల అస్వస్థత అనేసరి అందరూ షాకయ్యారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి శ్వాసకోశ సంబంధిత వ్యాధితో రెండు రోజుల నుంచి బాధపడుతుండడంతో కుటుంబ సభ్యులు ఆయనని సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఐసీయూలో ఉంచి సిరివెన్నెలకు కిమ్స్ వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
గత కొన్ని రోజుల నుంచి సిరివెన్నెల న్యూమోనియాతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. న్యూమోనియా కారణంగానే సిరివెన్నెల అస్వస్థతకు గురికావడంతో హుటాహుటిన కుటుంబ సభ్యులు ఆయన్ని ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం సిరివెన్నెల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కుటుంబ సభ్యులు తెలియజేసారు.