Advertisementt

బిగ్ బాస్ 5: ఈవారం ఊహించని ఎలిమినేషన్

Sat 27th Nov 2021 09:09 PM
bigg boss 5 telugu,anchor,bigg boss,ravi,siri,manas,shanmukh  బిగ్ బాస్ 5: ఈవారం ఊహించని ఎలిమినేషన్
Bigg Boss 5: 12th week elimination to leave all shell shocked బిగ్ బాస్ 5: ఈవారం ఊహించని ఎలిమినేషన్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 5 12 వారలు పూర్తి చేసుకుని 13 వ వారంలోకి అడుగుపెట్టబోతుంది. ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో షణ్ముఖ్ చివరి కెప్టెన్ గా బిగ్ బాస్ సీజన్ 5 లో నిలిచాడు. ఇక హౌస్ మేట్స్ ఇంటి సభ్యుల రాకతో.. బిగ్ బాస్ హౌస్ లో ఎమోషన్స్, కామెడీ, ఎంటర్టైన్మెంట్ పండాయి. సిరి - షణ్ముఖ్ లకి కాస్త షాక్ తగిలినా.. మళ్ళీ హౌస్ మేట్స్ అంతా హ్యాపీ గా ఉన్నారు. ఇక ఈ రోజు శనివారం బిగ్ బాస్ ఎపిసోడ్ లో నాగార్జున బిగ్ బాస్ స్టేజ్ పైకి మరికొంతమంది ఇంటి సభ్యులని తీసుకొచ్చి సర్ ప్రైజ్ చేసారు. అయితే ఈ వారం నామినేషన్స్ లో మానస్ తప్ప మిగతా వారంతా అంటే.. యాంకర్ రవి, షణ్ముఖ్, కాజల్, సన్నీ, ప్రియాంక, సిరి, శ్రీరామ్ చంద్ర ఉన్నారు. ఈ వారం హౌస్ లో నుండి ప్రియాంక కానీ, కాజల్ కానీ, సిరి కానీ వెళ్ళిపోతుంది.. ఈ ముగ్గురే డేంజర్ జోన్ లో ఉన్నట్లుగా ప్రచారం జరిగింది.

ఓటింగ్ పరంగా ప్రియాంక, కాజల్ లు వీక్ గా ఉండగా.. సిరి ఈ వారం తన తల్లి రాక తో డేంజర్ జోన్ కి వెళ్ళింది అన్నారు. అయితే అసలు ఈ వారం ఊహించని కంటెస్టెంట్ ఎలిమినేట్ అవడం హాట్ టాపిక్ కాదు.. అందరిని విస్మయానికి గురి చేసింది. గతంలో విశ్వ ఎలిమినేషన్ లో ఎంత ట్విస్ట్ ఇచ్చారో.. ఈవారం ఎలిమినేషన్ లోని అదే ట్విస్ట్ ఇచ్చారు బిగ్ బాస్. అంటే అసలు ఎవరూ ఊహించని కంటెస్టెంట్ యాంకర్ రవి ఈ వారం ఎలిమినేట్ అయ్యి ఇంటికెళ్లిపోయాడు. రేపు ఆదివారం రాబోయే ఎపిసోడ్ లీకై.. యాంకర్ రవి ఎలిమినేట్ అయిన విషయం సోషల్ మీడియాలో పాకి పోయింది. 

అయిపోతే రవి ఎలిమినేట్ అవడమే ఎవరూ ఊహించలేదు.. ఆ విషయాన్ని హౌస్ మేట్స్ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. రవి ఫాన్స్ అయితే షాక్ అవుతున్నారు. రవి కంటే సిరి, ప్రియాంక, కాజల్‌కు ఎక్కువ ఓట్లు రావడం ఈ ఎలిమినేషన్ నమ్మశక్యంగా లేదంటూ కామెంట్లు చేస్తున్నారు. అసలు ఈ ఎలిమినేషన్ కరెక్ట్ కాదంటూ బిగ్ బాస్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Bigg Boss 5: 12th week elimination to leave all shell shocked:

Bigg Boss 5: Ravi to be eliminated in the 12th week

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ