Advertisementt

ఇప్పుడైనా స్టార్ హీరోల చూపు ఆమెపై పడుతుందా

Sat 27th Nov 2021 08:53 PM
star heroes,samantha,naga chaitanya,mahesh ssmb 28,trivikram,star chances  ఇప్పుడైనా స్టార్ హీరోల చూపు ఆమెపై పడుతుందా
Will the eyes of the star heroes still fall on her ఇప్పుడైనా స్టార్ హీరోల చూపు ఆమెపై పడుతుందా
Advertisement
Ads by CJ

నాగ చైతన్య తో పెళ్లి తర్వాత సమంత స్టార్ హీరోల సినిమాలకి, కమర్షియల్ మూవీస్ కి దూరమైనా.. లేడీ ఓరియెంటెడ్ మూవీస్ తో సత్తా చాటింది. పెళ్లి తర్వాత సమంత కి ప్లాప్స్ లేవు.. అన్ని హిట్స్ అనేలా ఆమె కెరీర్ ని మలుచుకుంది. ఇక రీసెంట్ గా నాగ చైతన్య తో విడాకుల తర్వాత సమంత ఫుల్ స్వింగ్ లో సినిమాలు ఒప్పేసుకుంటుంది. ఇప్పటికే రెండు హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్, శాకుంతలం పాన్ ఇండియా ఫిలిం చేస్తున్న సమంత.. తాజాగా హాలీవుడ్ ఫిలిం అరెంజ్మెంట్స్ అఫ్ లవ్ కి సైన్ చేసి.. తన రేంజ్ ఇది అని చూపించింది. అంతేకాకుండా.. బాలీవుడ్ ఎంట్రీ పై కూడా క్లారిటీ ఇచ్చేసింది. ఈలెక్కన సమంత పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయింది. 

ఇక ప్రస్తుతం స్టార్ హీరోల పాన్ ఇండియా ఫిలిమ్స్ కి రష్మిక, పూజ హెగ్డే రీసెంట్ గా కియారా అద్వానీలు తప్ప మరో ఆప్షన్ లేకుండా పోయింది. పెళ్లి, విడాకుల తర్వాత పాన్ ఇండియా ఫిలిమ్స్, హాలీవుడ్ ఫిలిం తో క్రేజీగా దూసుకుపోతున్న సమంత పైన స్టార్ హీరోల చూపు ఇప్పటికయినా పడుతుందా.. సమంత రేంజ్, ఆమె గ్లామర్, ఆమె బోల్డ్ నెస్ అన్ని స్టార్ హీరోలకి బాగా యూస్ అవుతాయి. మరి ఈ లెక్కన సమంత ని తమ సినిమాల్లో ప్రిపేర్ చేస్తారో.. లేదంటే మళ్ళీ పూజ హెగ్డే, రష్మిక, కియారా ల దగ్గరే ఆగిపోతారో అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇక మహేష్ - త్రివిక్రమ్ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా ఫైనల్ కాగా.. ఇప్పుడు ఆ ప్లేస్ ని సమంత కొట్టేసింది అనే టాక్ ఉంది.. చూద్దాం ఇలాంటి ఆఫర్స్ ఎన్ని సమంత తలుపుతాడతాయో అనేది. 

Will the eyes of the star heroes still fall on her:

Will the chances of star heroes come to Samantha?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ