బిగ్ బాస్ సీజన్ 5 శనివారం ఎపిసోడ్స్ ని నాగార్జున రక్తి కట్టిస్తున్నాడు ఆదివారం ఎలిమినేషన్ ఎపిసోడ్ లో మజా లేకపోయినా.. శనివారం మాత్రం నాగార్జున హౌస్ మేట్స్ ని కాస్త టెంక్షన్ పెడుతూ క్లాస్ ఇస్తూ.. కామెడీ చేస్తూ ఆ ఎపిసోడ్ పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాడు నాగ్. ఇక ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో ఇంటి సభ్యుల రాకతో హౌస్ మేట్స్ మొహాలు కళకళ్లాడుతుంటే.. షణ్ముఖ్ మదర్ ఇచ్చిన క్లాస్ కి, సిరి మదర్ పీకిన క్లాస్ కి వారిద్దరూ బాగా డిస్టర్బ్ అయ్యారు. షణ్ముఖ్ - సిరి ల హగ్స్ నచ్చలేదని షణ్ముఖ్ మదర్ ఇండైరెక్ట్ గా చెబితే.. సిరి మదర్ డైరెక్ట్ గానే చెప్పారు.
ఇక నాగార్జున ఈ రోజు కూడా ఇంటి సభ్యుల రాక తో బిగ్ బాస్ స్టేజ్ నిండుగా కనిపించింది. నాగ్ అలా చెప్పిన వెంటనే రవి మదర్ వచ్చేసారు. తర్వాత జబర్దస్త్ నారాయణ, సాయి ప్రియాంక కోసం రాగా.. బిగ్ బాస్ సీజన్ వన్ విన్నర్ శివ బాలాజీ కూడా స్పెషల్ గా బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చి ఏ రవి ఇప్పుడు తెలిసిందా బిగ్ బాస్ అంటే ఏమిటో అంటూ ఫన్ చేసాడు. ఇక నాగార్జున వీరందరితో బిగ్ బాస్ సీజన్ 5 లో టాప్ 5 కి వెళ్ళేవారెవరో అనగానే శివ బాలాజీ సర్ నేను వెళ్ళొస్తా అంటూ బిల్డప్ ఇచ్చాడు. ఇక సిరి నీ కోసం శ్రీహన్ వచ్చాడు అనగానే సిరి బాగా ఎమోషనల్ గా ఏడ్చేసింది. కాజల్ సిరిని పట్టుకుని ఓదార్చగా.. శ్రీహన్ బిగ్ బాస్ స్టేజ్ పై ఏంటి సిరి వదిలేస్తున్నావా.. అంటూ సిరికి మాములు షాక్ ఇవ్వలేదు. అది ఈ రోజు ప్రోమో హైలైట్స్.