ఉయ్యాలా జంపాలతో హీరోగా మారిన రాజ్ తరుణ్ ఆ వెంటనే కుమారి 21 F ఆ తర్వాత సినిమా చూపిస్తా మావా అంటూ జోరు చూపించాడు. ఇక ఆ తర్వాత రాజ్ తరుణ్ చేసిన సినిమాలేవీ హిట్ అవ్వలేదు.. కనీసం సో సో గా ఆడిన పాపాన పోలేదు.. హీరోగా వరస సినిమాలు చేస్తున్నాడు తప్ప సక్సెస్ మాత్రం అవవడం లేదు. రీసెంట్ గానే పవర్ ప్లే తో ప్లాప్ కొట్టిన రాజ్ తరుణ్ తనని హీరో చేసిన అన్నపూర్ణ స్టూడియో బ్యానర్ ని నమ్ముకుని అనుభవించు రాజా చెయ్యగా.. ఆ సినిమా కూడా నిన్న శుక్రవారమే రిలీజ్ అయ్యి.. నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. అనుభవించు రాజా లో రాజ్ తరుణ్ రాజ్ గా పెరఫార్మెన్స్ పరంగా ఆకట్టుకున్నాడు కానీ.. సినిమా కథ, డైరెక్షన్ అన్నినెగెటివ్ గా నిలిచాయి.
అనుభవించు రాజా సినిమాలో స్టోరీ రొటీన్ గా ఉండడం, కామెడీ సరిగ్గా పండకపోవడం, డైరెక్షన్ వీక్ గా ఉండడం తో.. ఆ సినిమాకి క్రిటిక్స్ కూడా నెగెటివ్ రివ్యూస్ ఇచ్చారు. మరీ పూర్ రివ్యూస్ ఇవ్వడంతో సినిమాకి నెగెటివ్ టాక్ పడిపోయింది. రాజ్ తరుణ్ పెరఫార్మెన్స్ ,కొన్ని కామెడీ సీన్స్, సినిమాటోగ్రఫీ తప్ప సినిమాలో ఏం లేదంటూ అనుభవించు రాజా చూసిన ఆడియన్స్ ఫీలింగ్. అన్నపూర్ణ స్టూడియోస్ అంటే కథా బలమున్న సినిమాలు వస్తాయి.. చిన్న సినెమాలయితే ఏంటి, పెద్ద సినిమాలైతే ఏంటి అని.. ప్రేక్షకులు అనుకున్నారు. అందులోనూ ఎంతో ఎక్సపీరియెన్స్ ఉన్న నాగార్జున మేనకోడలు.. ఈ సినిమాని నిర్మించింది అంటే.. ఎంతో కొంత అంచనాలు ఉంటాయి.. కానీ అనుభవించురాజా మాత్రం ఆ అంచనాలు అందుకోవడంలో టోటల్ గా ఫెయిల్ అయ్యి రాజ్ తరుణ్ ఖాతాలో మరో ప్లాప్ ని వేసింది.