Advertisementt

ఆచార్య కి అదిరిపోయే డీల్

Fri 26th Nov 2021 10:39 PM
acharya movie,chiranjeevi,acharya streaming rights,amazon prime video,ram charan,pooja hegde,koratala shiva  ఆచార్య కి అదిరిపోయే డీల్
Chiranjeevi, Ram Charan Acharya Locks OTT ఆచార్య కి అదిరిపోయే డీల్
Advertisement
Ads by CJ

చిరంజీవి - రామ్ చరణ్ కలయికలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఆచార్య మూవీ ఫిబ్రవరి 4 న రిలీజ్ కి డేట్ ఫిక్స్ చేసుకుంది. ఎప్పుడో మే లో రిలీజ్ అవ్వాల్సిన ఆచార్య.. వచ్చే ఏడాదికి వెళ్లిపోవడంతో మెగా ఫాన్స్ కాస్త ఫిలయ్యారు. ఇక చిరంజీవి - రామ్ చరణ్ కలయికలో మూవీ అనగానే అంచనాలు.. ఆకాశంలో ఉన్నాయి. ఆచార్య నుండి రామ్ చరణ్ సిద్దా టీజర్ రిలీజ్ చెయ్యడానికి డేట్ ఫిక్స్ చేసింది టీం.. ఇక ఆచార్య నుండి రీసెంట్ గానే నీలాంబరి సాంగ్ లో పూజ హెగ్డే - రామ్ చరణ్ జంట రొమాంటిక్ గా అదరగొట్టేసింది. అయితే భారీ అంచనాలతో పలు భాషల్లో రిలీజ్ అవుతున్న ఆచార్య సినిమాకి డిజిటల్ హక్కులుకు అదిరిపోయే రేటు వచ్చింది అంటున్నారు.

ప్రముఖ ఓటిటి అమెజాన్ ప్రైమ్ వారు ఆచార్యకి మెగాస్టార్ చిరు కెరీర్ లోనే అదిరిపోయే డీల్ తో ఆచార్య డిజిటల్ హక్కులని సొంతం చేసుకుంది అని అంటున్నారు. ప్రస్తుతం సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అయినా.. మళ్ళీ ఓటిటీలలో కూడా ఆ సినిమాలు హిట్ అవడంతో.. ఆమెజాన్ ప్రైమ్ ఆచార్యకి కళ్ళు చెదిరే డీల్ ఇవ్వడంతో.. ఆచార్య ని మేకర్స్ అమ్మేశారని అంటున్నారు. ఇక ఆచార్య సినిమా థియేటర్లలోకి వచ్చిన ఆరు వారాలకు స్ట్రీమింగ్ చేయడానికి అమెజాన్ తో మేకర్స్ ఒప్పందం కుదుర్చుకున్నారని కూడా టాక్ వినిపిస్తోంది.

Chiranjeevi, Ram Charan Acharya Locks OTT:

Acharya movie streaming rights bagged by Amazon Prime

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ