టాలీవుడ్ టాప్ హీరోయిన్ ఎవరయ్యా అంటే.. వెంటనే పూజ హెగ్డే పేరు చెబుతారు.. ఆ తర్వాతే ఏ హీరోయిన్ అయినా..అన్నట్టుగా పూజ హెగ్డే ఉంది.. అలా వైకుంఠపురములో సినిమా వరకు ఒక్క బ్లాక్ బస్టర్ లేకపోయినా.. స్టార్ హీరోస్ ఫస్ట్ ఛాయస్ పూజ హెగ్డే నే. ఇక అలా వైకుంఠపురములో బ్లాక్ బస్టర్ తర్వాత ఆమె హావా మరింతగా పెరిగిపోయింది. ఏ చిన్న అవకాశాన్ని వదలడం లేదు పూజ హెగ్డే. ప్లాప్ హీరో హీరో అఖిల్ తో అవకాశం వచ్చింది చేసేసింది.. అఖిల్ కి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో హిట్ ఇచ్చేసింది. ఇక రామ్ చరణ్ తో ఆచార్యలో చిన్న అవకాశం వచ్చింది అయినా వదల్లేదు.. అటు తమిళ్, ఇటు హిందీ మూవీస్ తోను బిజీ అయినా.. పూజ హెగ్డే అవకాశం వస్తే వదలదు అన్నట్టుగా ఉంటుంది. ప్రభాస్ తో పాన్ ఇండియా ఫిలిం రాధేశ్యామ్ రిలీజ్ కి రెడీ అయ్యింది.
అంతేకాకుండా మహేష్ SSMB28 లోను పూజ హెగ్డే నే హీరోయిన్.. అధికారిక ప్రకటన కూడా వచ్చింది.
అయితే తాజాగా పూజ హెగ్డే హిందీ, తమిళ మూవీస్ తో డేట్స్ అడ్జెస్ట్ చెయ్యలేక మహేష్ - త్రివిక్రమ్ కాంబో SSMB28 నుండి తప్పుకున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. ఆమె డేట్స్ అడ్జెస్ట్ చెయ్యలేక తప్పుకోవడంతో.. ఆ ప్లేస్ లోకి త్రివిక్రమ్ సమంత ని తీసుకురాబోతున్నాడని, ఇప్పటికే సమంత తో చర్చలు కూడా జరుపుతున్నారంటూ టాక్ టాలీవుడ్ లో మొదలైపోయింది. ఎలాగూ నాగ చైతన్యతో డివోర్స్ తీసుకుని సమంత ఇప్పుడు క్రేజీగా అడుగులు వేస్తుంది.. ఇలాంటి సమయంలో సమంత క్రేజ్ కూడా సినిమాకి హెల్ప్ అవుతుంది అని త్రివిక్రమ్ భావిస్తున్నాడని అంటున్నారు.. మరి పూజ హెగ్డే ప్లేస్ లోకి సమంత వస్తుందా.. లేదా.. అనేది చూడాలి.