Advertisementt

కత్రినా-విక్కీ పెళ్ళి ఇన్విటేషన్: కండిషన్స్ అప్లై

Thu 25th Nov 2021 10:31 PM
vicky kaushal,katrina kaif,diktat to guests at wedding,no mobiles  కత్రినా-విక్కీ పెళ్ళి ఇన్విటేషన్: కండిషన్స్ అప్లై
Katrina - Vicky Wedding: Conditions Apply కత్రినా-విక్కీ పెళ్ళి ఇన్విటేషన్: కండిషన్స్ అప్లై
Advertisement
Ads by CJ

బాలీవుడ్ లవ్ బర్డ్స్ కత్రినా కైఫ్ - విక్కీ కౌశల్ లు త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారు. ప్రస్తుతం పెళ్లి పనులని విక్కీ కౌశల్ దగ్గరుండి చూసుకుంటున్నాడు. డిసెంబర్ 7 నుండి రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్ జిల్లాలోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ హోటల్‌లో 12 వరకు విక్కీ కౌశల్ - కత్రినా పెళ్లి వేడుకలు అంగరంగ వైభవంగా జరగబోతున్నాయి. ఇప్పటికే సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ హోటల్‌లో రూమ్స్ కూడా బుక్ అయ్యాయి అని, కత్రినా - విక్కీ పెళ్ళికి బాలీవుడ్ ఇండస్ట్రీ నుండి చాలామంది సెలబ్రిటీస్ హాజరవ్వబోతున్నారని, అలాగే ఇరు కుటుంబాల వారు ఈ వేడుకలకి హాజరవడమే కాదు.. పెళ్లి ఏర్పాట్లని దగ్గరుండి చూసుకుంటారని తెలుస్తుంది.

అయితే కత్రినా కైఫ్ - విక్కీ కౌశల్ పెళ్ళికి కండిషన్స్ అప్లై అంటున్నారు. అంటే వీరి పెళ్ళికి హాజరయ్యే అతిధులు మొబైల్స్ తీసుకురాకూడదనే కండిషన్స్ పెట్టిందట ఈ జంట. ఈ జంట పెళ్లికి ఇన్విటేషన్ ఇచ్చే సమయంలోనే గెస్టులకు ప్రత్యేకంగా చెబుతున్నారట.. నో మొబైల్ అని. ఎవరు కూడా మొబైల్ తో తమ పెళ్లి ఫొటోలు తీయకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. తమ పెళ్లి ఫొటోస్ తాము షేర్ చేసే వరకు ఏ సోషల్ మీడియాలోనూ రాకుండా ఈ జంట తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఇక ఈ పెళ్లి చాలా గోప్యంగా జరగాలని కూడా ఈవెంట్ మేనేజ్మెంట్ కు ఈ జంట ప్రత్యేకంగా హెచ్చరికలు చేసినట్లు తెలుస్తోంది.

Katrina - Vicky Wedding: Conditions Apply:

No mobiles please! Vicky Kaushal-Katrina Kaif to issue diktat to guests at wedding

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ