Advertisementt

బిగ్ బాస్ 5: హౌస్ లో ఎమోషన్స్

Thu 25th Nov 2021 09:20 PM
bigg boss 5,bvigg boss telugu,siri,shanmukh,ravi,sunny,manas,welcome family members  బిగ్ బాస్ 5: హౌస్ లో ఎమోషన్స్
Bigg Boss 5: Emotions in the House బిగ్ బాస్ 5: హౌస్ లో ఎమోషన్స్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 5 లో ఎనిమిదిమంది హౌస్ మేట్స్ ఉన్నారు. సిరి, షణ్ముఖ్, రవి, శ్రీరామ చంద్ర, మానస్, సన్నీ, ప్రియాంక, కాజల్ ఉన్నారు. అయితే లాస్ట్ కెప్టెన్ గా షణ్ముఖ్ అవతరించాక.. బిగ్ బాస్ సర్ ప్రైజ్ గా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యులని హౌస్ లోకి పంపుతున్నాడు. నిన్న ఎపిసోడ్ లో కాజల్ భర్త, కూతురు రాగా.. హౌస్ అంతా ఎమోషనల్ గా మారిపోయింది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో శ్రీరామ్ చంద్ర సిస్టర్ వచ్చింది. అలాగే మానస్ మదర్ కూడా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టి అల్లరల్లరి చేసింది. మానస్ తో కన్నా హౌస్ మేట్స్ తో ఆమె ఉన్న తీరు. ఇంట్రెస్టింగ్ గా కనిపించింది.. నాకు మానస్ కి మీ లాంటి అమ్మాయిని చూడండి అన్న శ్రీరామ చంద్రకి నీకోసం హమీద వెయిటింగ్ అంటూ షాక్ ఇచ్చారు మానస్ తల్లి. ఇక సన్నీ ప్లీజ్ మా కోసం 2 డేస్ హౌస్ లో ఉండండి ఆంటీ అన్నాడని.. నన్ను ఆంటీ అంటావా అంటూ అలిగింది. ఇక షణ్ముఖ్ ని నాకు హాగ్ ఇచ్చుకో నేను తనకి ఇస్తా అంటూ ఓదార్చేసింది.

ఇక సన్నీ మదర్ వచ్చారు. ఆమె చాలా ఎమోషనల్ అయ్యారు. ఎంటబ్బాయ్ అట్టా చూస్తున్నావ్ అని సన్నీ ని అనగానే.. సన్నీ మిమ్మల్ని ఎక్కడో చూసానే.. అంటూ మదర్ ని ఆటపట్టించాడు. నా బంగారు కొండా అంటూ సన్నీని హాగ్ చేసుకుంది ఆవిడ. సిరి మదర్ హౌస్ లోకి అడుగు పెట్టడం ఆమె సిరి - షణ్ముఖ్ ల హగ్స్ నచ్చలేదని ఓపెన్ గానే చెప్పడం ఉదయం ప్రోమోలో చూపించిన స్టార్ మా .. తాజా ప్రోమోలో.. సిరి చిన్నప్పుడే ఊహతెలిసినప్పుడే  తండ్రి చనిపోయాడు.. నేను ఓ పాన్ షాప్ పెట్టుకుని సిరిని పెంచాను.. చదివించాను. నన్ను చాలా మాటలు అన్నారు.. ఈ బిగ్ బాస్ లో సిరిని కోట్లాదిమంది చూస్తున్నారు చాలా హ్యాపీ ఫిల్ అవుతున్నాను.. నేను ఎక్కడ కనిపించినా బిగ్ బాస్ సిరి అమ్మ అంటున్నారు అంటూ తెగ ఎమోషనల్ అయ్యింది సిరి మదర్. 

Bigg Boss 5: Emotions in the House:

Bigg Boss 5 to welcome family members

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ