Advertisementt

షాకింగ్: చైతూకి సమంత కన్నా ముందే..

Thu 25th Nov 2021 10:17 AM
samantha akkineni,naga chaitanya,marry,shruti haasan,kamal haasan,akshra haasan  షాకింగ్: చైతూకి సమంత కన్నా ముందే..
Shocking: Before Samantha, Naga Chaitanya Wanted to Marry Shruti Haasan షాకింగ్: చైతూకి సమంత కన్నా ముందే..
Advertisement
Ads by CJ

నాగ చైతన్య సమంత ని ఐదేళ్లు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అందమైన జంటగా, క్యూట్ కపుల్, ఆదర్శ దంపతులుగా నాలుగేళ్లు కనిపించిన ఈ జంట అనుకోకుండా డివోర్స్ తీసుకుని విడిపోవడం అందరికి బాధ అనిపించింది. ఇప్పటికి ఈ విషయాన్నీ చాలామంది నమ్మలేకపొతున్నారు. హే వాళ్ళు విడిపోవడం ఏమిటి అంటున్నారు. కానీ అది వాస్తవం ఐదేళ్ల ప్రేమని, నాలుగేళ్ళ వైవాహిక జీవితానికి సమంత - నాగ చైతన్య ముగింపు పలికి ఎవరి దారుల్లో వారు ప్రయాణిస్తున్నారు. అయితే ఇప్పుడొక షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే.. సమంత కన్నా ముందే నాగ చైతన్య మరో స్టార్ హీరోయిన్ తో పీకల్లోతు ప్రేమలో పడ్డాడు అని, వారు తిరగని చోటు లేదు అని.. పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నారంటూ ఇప్పుడొక న్యూస్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది.

నాగ చైతన్య ప్రేమించింది ఎవరినో కాదు.. కమల్ హాసన్ కూతురు స్టార్ హీరోయిన్ శృతి హాసన్ నే అంట. అందులో నిజమెంతుందో కానీ.. చైతూ.. శృతి ప్రేమలో మునిగితేలాడని.. కాకపోతే పెళ్లి చేసుకొనే సమయం వచ్చినప్పుడు శృతికి నాగ చైతన్యకి బ్రేకప్ అయ్యింది అని, అది కూడా శృతి చెల్లెలు అక్షర హాసన్ వల్లే అంటూ అబ్బో.. ఇలా ఆ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శృతి హాసన్, అక్షర హాసన్, నాగ చైతన్య ఓ ఈవెంట్ కి వెళ్లగా.. అక్కడ శృతి హాసన్ స్టేజ్ పై డాన్స్ చెయ్యాల్సి రాగా.. అప్పుడు అక్షర హాసన్ ని చూసుకోమని చైతూకి చెప్పినా.. చైతు మాత్రం శృతి వచ్చేవరకు అక్షరా ని చూసుకోకుండా వెళ్లిపోవడంతో శృతి హాసన్ కి చైతూకి బ్రేకప్ అయ్యింది అంటున్నారు.

మరి సోషల్ మీడియాకి దూరంగా ఉండే.. నాగ చైతన్య వ్యక్తిగత విషయాలను చాలా సీక్రెట్ మెయింటింగ్ చేసే చైతూ.. సమంత తో రిలేషన్, పెళ్లి, ప్రేమ అన్ని సమంత ద్వారా బయటికి వచ్చినవే.. లాస్ట్ కి డివోర్స్ విషయం కూడా .. అలాంటి నాగ చైతన్య శృతి హాసన్ ని ప్రేమించడం.. ఇదేదో పిట్ట కథలా లేదూ అంటున్నారు నెటిజెన్స్.

Shocking: Before Samantha, Naga Chaitanya Wanted to Marry Shruti Haasan:

Shocking: Before Samantha Akkineni, Naga Chaitanya Wanted to Marry Shruti Haasan

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ