Advertisementt

కన్ ఫర్మ్: అనసూయ అవుట్

Thu 25th Nov 2021 08:03 AM
masterchef telugu,masterchef,anasuya bharadwaj,host anasuya,anasuya photos  కన్ ఫర్మ్: అనసూయ అవుట్
Confirm: Anasuya out కన్ ఫర్మ్: అనసూయ అవుట్
Advertisement
Ads by CJ

జబర్దస్త్ స్టేజ్ పై గ్లామర్ గా హొయలు పోయే అనసూయ కి బుల్లితెర మీది మాంచి డిమాండ్ ఉంది. ఒకప్పుడు సినిమా ఈవెంట్స్ కి హోస్ట్ చేసే అనసూయ ఇప్పుడు వెండితెర మీద ఫోకస్ పెట్టింది. సిల్వర్ స్క్రీన్ మీద ఫోకస్ పెట్టిన అనసూయ ప్రస్తుతం వెండితెర మీద ఖిలాడీ మూవీ లో పవర్ ఫుల్ కేరెక్టర్ చేస్తుంటే.. చిరు గాడ్ ఫాదర్ లో కీలక పాత్ర చేస్తుంది. ఇంకా అనసూయ పవర్ ఫుల్ గా ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ, అలాగే వెబ్ సీరీస్ లో నటిస్తుంది. అయితే క్రేజీ అనసూయ మాస్టర్ చెఫ్ ప్రోగ్రాం హోస్ట్ ఛాన్స్ వచ్చినట్టే వచ్చి రెండు, మూడు వారాల్లో చేజారి పోవడం హాట్ టాపిక్ అయ్యింది. రెండు, మూడు వారాల పాటు బెంగుళూర్ మాస్టర్ చెఫ్ సెట్ కి వెళ్లి హోస్ట్ చేసిన అనసూయని మాస్టర్ చెఫ్ ఈవెంట్ నిర్వాహకులు తప్పించినట్లుగా తెలుస్తుంది.

తమన్నా హోస్ట్ గా మొదలైన మాస్టర్ చెఫ్ ప్రోగ్రాం.. తర్వాత తమన్నా తో వచ్చిన విభేదాల వలన ఆమెని తప్పించి ఆ ప్లేస్ లోకి అనసూయని తీసుకొచ్చారు మాస్టర్ చెఫ్ ఈవెంట్ నిర్వాహకులు. అయితే మూడు వారాల ముచ్చట అన్న తీరులో అనసూయ హోస్ట్ ఉంది. రెండు మూడు వారాలుగా అదిరిపోయే డ్రెస్ సెన్స్ తో, అదిరిపోయే మాస్టర్ చెఫ్ ఫోటో షూట్ తో అదరగొట్టిన అనసూయ గత రెండు వారాలుగా మాస్టర్ చెఫ్ ప్రోగ్రాం లో కనిపించడం లేదు. మాస్టర్ చెఫ్ జెడ్జిస్ హోస్ట్ లుగా మారిపోయి ప్రోగ్రాం ని నడిపిస్తున్నారు. ఒక్క వారం అనసూయ మిస్ అయితే ఓకె.. రెండో వారంలోనూ అనసూయ కనిపించలేదు.. సో కన్ ఫర్మ్ గా అనసూయ మాస్టర్ చెఫ్ నుండి అవుట్ అని అర్ధమైపోతుంది. 

Confirm: Anasuya out:

MasterChef Telugu to conclude without interim host Anasuya Bharadwaj

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ