పుష్ప సినిమా డిసెంబర్ 17 న విడుదలవ్వడం సాధ్యమేనా అంటూ సోషల్ ఇండియాలో రచ్చ జరుగుతుంది. దానికి కారణాలు కూడా వైరల్ చేస్తున్నారు. ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు. అల్లు అర్జున్ ఇప్పుడే డబ్బింగ్ చెప్పడం స్టార్ట్ చేసారు. ఐదు భాషల్లో అప్పుడే డబ్బింగ్ చెప్పేసి.. డిసెంబర్ 17 న రిలీజ్ చేస్తారా.. ఇన్ని అనుమానాలతో పుష్ప రిలీజ్ పై డౌట్స్ క్రియేట్ చేస్తుంటే.. పుష్ప మేకర్స్ తగ్గేదే లే.. పుష్ప ఖచ్చితంగా డిసెంబర్ 17 నే అంటూ ఘంటాపథంగా చెబుతున్నారు. మళ్ళీ ఇప్పుడు పుష్ప పై అనుమాలు అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది.
అది పుష్ప దర్శకుడు సుకుమార్ ఉన్నట్టుండి అస్వస్థతకు గురవడంతో.. ఆయన కొన్ని రోజులు బెడ్ రెస్ట్ లో ఉండాలని డాక్టర్స్ చెప్పారని.. ఇలాంటి టైం లో సుక్కు బెడ్ ఎక్కితే పుష్ప రిలీజ్ ఎలా సాధ్యమంటున్నారు. పుష్ప పోస్ట్ ప్రొడక్షన్ జరగాలంటే సుకుమార్ ఖచ్చితంగా ఉండాలి.. ఆయన లేకపోతే అవి పోస్ట్ పోన్ అవుతాయి. సుకుమార్ కి రెండు నెలల క్రితం డెంగ్యూ వచ్చి.. పుష్ప షూటింగ్ కి కొన్ని రోజులు బ్రేకులు వెయ్యడం, ఆయన కోలుకుని మళ్ళీ రెండు నెలలుగా పుష్ప షూటింగ్ లో విశ్రాంతి లేకుండా పని చెయ్యడం వలన మరీ నీరసించి.. రెస్ట్ లోకి వెళ్లాల్సి వచ్చింది అని అంటున్నారు.
ఇక ఇప్పటివరకు పుష్ప పనులన్నీ వేగంగా జరుగుతుండడం, సుకుమార్ లేకపోవడంతో.. ఇప్పుడు అవన్నీ ఎక్కడికక్కటే ఆగిపోయాయని. సో ఇలాంటి పరిస్థితిల్లో పుష్ప డిసెంబర్ 17 న రావడం సాధయమయ్యే పని కాదు అంటున్నారు. చూద్దాం మేకర్స్ నిర్ణయం ఎలా ఉందో అనేది.