Advertisementt

ఈమాత్రం కూడా దాచలేకపోతున్నావా బిగ్ బాస్

Wed 24th Nov 2021 07:29 PM
bigg boss 5,bigg boss telugu,bigg boss,shanmukh jaswanth,new captain  ఈమాత్రం కూడా దాచలేకపోతున్నావా బిగ్ బాస్
Can't even hide this, Bigg Boss ఈమాత్రం కూడా దాచలేకపోతున్నావా బిగ్ బాస్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ వన్ లో ఎలాంటి లీకులు లేకుండా జాగ్రత్తలు పడిన బిగ్ బాస్ యాజమాన్యం.. బిగ్ బాస్ సీజన్ 2 నుండి లీకులు మొదలై.. సీజన్ 5 వచ్చేసరికి.. ఏ రోజు ఎపిసోడ్ ఆ రోజు ఉదయమే సోషల్ మీడియాలో లీకైపోయి.. రాత్రి రాబోయే ఎపిసోడ్ పై ఇంట్రెస్ట్ ని చంపేస్తుంది. ఆఖరికి ఆదివారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్స్ పేరు శనివారం రాత్రి 9 గంటలకే బయటికి వచ్చేస్తుంది. అలాగే సోమవారం నామినేషన్స్ విషయము అంతే. ఇక ఆ వారంలో కెప్టెన్సీ టాస్క్ కూడా సుదీర్ఘంగా మూడు రోజులు సాగినా.. ఆ వారం హౌస్ కెప్టెన్ ఎవరో రెండు రోజుల ముందే లీకైపోతుంది.

నిన్నటికి నిన్న కెప్టెన్సీ టాస్క్ లో జరిగిన రచ్చతో ఈ వారం అందులోనూ బిగ్ బాస్ సీజన్ 5 చివరి కెప్టెన్ ఎవరు అవుతారా అనే ఉత్కంఠ అందరిలో కలిగించింది. కానీ ఈ రోజు ఉదయమే ఈ రోజు రాత్రి జరిగిన ఎపిసోడ్ లీకైపోయి.. షణ్ముఖ్ సీజన్ 5 లాస్ట్ కెప్టెన్ అంటూ లీకులు చెప్పేసాయి. అదంతా ఓకె.. ఆఖరికి బిగ్ బాస్ ప్రోమోస్ లోనూ ఈ రోజు షణ్ముఖ్ కెప్టెన్ అయిన విషయాన్నీ చూపించేసారు. అంటే షణ్ముఖ్ కెప్టెన్ బ్యాండ్ పెట్టుకుని ఉన్న ప్రోమో వదిలేసారు. కనీసం సోషల్ మీడియా చూడని వాళ్ళకి ఈరోజు కెప్టెన్ ఎవరు అవుతారో అనే ఆత్రుత అయినా ఉంటుంది అనుకుంటే.. అదీ లేకుండా ప్రోమోస్ లోనూ ఇలా చూపించేస్తే రాత్రి ఎపిసోడ్ పై ఏం కిక్ ఉంటుంది. అందుకే అనేది ఇది కూడా దాచలేకపోతున్నావా బిగ్ బాస్ అనేది.

Can't even hide this, Bigg Boss:

Bigg Boss 5: Shanmukh Jaswanth Becomes The New Captain

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ