ఎన్టీఆర్ ప్రస్తుతం, ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ కోసం వెయిటింగ్. ఆ తర్వాత కొరటాలతోనూ, ప్రశాంత్ నీల్ తోనూ ఎన్టీఆర్ పాన్ ఇండియా మూవీస్ కమిట్ అయ్యి ఉన్నాడు. ప్రస్తుతం భార్య లక్ష్మి ప్రణతి, పిల్లలు భార్గవ్ రామ్, అభయ్ రామ్ లతో యూరప్ లో వెకేషన్స్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే ఎన్టీఆర్ - నాగ్ అశ్విన్, స్వప్న దత్ వాళ్ళు పారిస్ లో ఎన్టీఆర్ తో మీట్ అవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అంటే ఎన్టీఆర్ తో నాగ్ అశ్విన్ సినిమా చర్చలు జరిపారు అంటూ ఇప్పుడొక న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎన్టీఆర్ - నాగ్ అశ్విన్, స్వప్న దత్ లు మంచి ఫ్రెండ్స్. మరి వెకేషన్స్ లో ఫ్రెండ్లీ గా మీట్ అయినా కానీ.. ఇప్పుడు ఎన్టీఆర్ - నాగ్ అశ్విన్ కాంబో అంటూ తెర మీదకి ఓ టైటిల్ వచ్చి కూర్చుంది..
ప్రస్తుతం నాగ్ అశ్విన్ ప్రభాస్ తో పని చెయ్యబోయే పాన్ వరల్డ్ మూవీ ప్రాజెక్ట్ కె స్క్రిప్ట్ పూర్తి చేసి.. సినిమాని పూజ కార్యక్రమాలతో మొదలు పెట్టేసారు. అయితే ప్రభాస్ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్న నాగ్ అశ్విన్ .. ప్రభాస్ తో క్రేజీ గా ప్రాజెక్ట్ కె ని భారీ బడ్జెట్ తో తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నారు. ఈలోపు నాగ్ అశ్విన్ వెకేషన్స్ లో ఎన్టీఆర్ ని కలవడంతో.. ఇప్పుడు ఎన్టీఆర్ తో నాగ్ అశ్విన్ మూవీ ఉండొచ్చనే ఊహాగానాలు మొదలైపోయాయి.