Advertisementt

అనుభవించురాజా అయినా గట్టెక్కిస్తాడా?

Sun 27th Mar 2022 11:49 AM
raj tarun,anubhavinchu raja movie,raj tarun anubhavinchu raja  అనుభవించురాజా అయినా గట్టెక్కిస్తాడా?
Raj Tharaun pins all his hopes on Anubhavinchu Raja అనుభవించురాజా అయినా గట్టెక్కిస్తాడా?
Advertisement
Ads by CJ

కుమారి 21F, ఉయ్యాలా జంపాల, సినిమా చూపిస్తా మావ సినిమాల తర్వాత రాజ్ తరుణ్ కి హిట్ అనే పదమే దూరమైపోయింది. యంగ్ హీరోల్లో వరస ప్లాప్ ల్లో కొట్టుమిట్టాడుతున్న హీరో ఎవరన్నా ఉన్నరంటే ఫస్ట్ రాజ్ తరుణ్ అనేలా ఉంది వ్యవహారం. సీతమ్మ అందాలు, ఈడో రకం ఆడోరకం, నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్, కిట్టు ఉన్నాడు జాగ్రత్త, అందగాడు, రంగుల రాట్నం, రాజుగారు, లవర్, ఇద్దరి లోకం ఒక్కటే, ఒరేయ్ బుజ్జిగా, పవర్ ప్లే.. ఇలా వరసగా ప్లాప్స్ మీద ప్లాప్స్ కొడుతున్న రాజ్ తరుణ్ మరో రెండు రోజుల్లో అనుభవించురాజా మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మరి ఈ సినిమా పోస్టర్స్, బ్యానర్, అలాగే టీజర్, ట్రైలర్, సాంగ్స్ అన్ని ఇంట్రెస్టింగ్ గానే కనిపిస్తున్నాయి.

మరోపక్క అనుభవించు రాజా టీం ప్రమోషన్స్ కూడా జోరు మీదున్నాయి. ఇప్పటికే ప్రీ రిలీజ్ ప్రమోషన్స్ తో టీం అదరగొట్టేస్తుంది. మరి అనుభవించురాజా అయినా రాజ్ తరుణ్ ని ప్లాప్ ల నుండి బయటపడేస్తుందా? ఈ సినిమా అయినా రాజ్ తరుణ్ కెరీర్ ని నిలబెడుతుందా? అనేది మరో రెండు రోజుల్లో తేలిపోతుంది. ఇక రాజ్ తరుణ్ నెక్స్ట్ మూవీ స్టాండప్ కామెడీ పై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. మరి ఈ అనుభవించురాజా సినిమా తో రాజ్ తరుణ్ మళ్ళీ హీరోగా నిలబడాలని కోరుకుందాం. 

Raj Tharaun pins all his hopes on Anubhavinchu Raja:

Raj Tarun Anubhavinchu Raja to release on Nov 26

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ