Advertisementt

మహేష్ - ఎన్టీఆర్ కలిస్తే రచ్చ రచ్చే

Tue 23rd Nov 2021 05:04 PM
ntr,mahesh babu,evaru meelo kotiswarulu episode,ntr-mahesh babu evaru meelo kotiswarulu episode,ntr-mahesh babu combo  మహేష్ - ఎన్టీఆర్ కలిస్తే రచ్చ రచ్చే
EMK: NTR-Mahesh Babu episode promo out మహేష్ - ఎన్టీఆర్ కలిస్తే రచ్చ రచ్చే
Advertisement
Ads by CJ

స్టార్ హీరోలని ఒకే స్క్రీన్ మీద చూస్తే ఫాన్స్ కి పట్ట పగ్గాలు ఉండవు. స్టార్ హీరోలు ఏదైనా సినిమా ఈవెంట్స్ స్టేజ్ మీద చూస్తేనే ఫాన్స్ కి పూనకాలొచ్చేస్తాయి. అలాంటిది ఒకే సినిమాలో అంటూ ఎన్టీఆర్ - రామ్ చరణ్ లు కలిసి ఆర్.ఆర్.ఆర్ తో రచ్చకి సిద్ధమైతే.. ఇప్పడు బుల్లితెర మీద ఎన్టీఆర్ - మహేష్ బాబు లు ఎవరు మీలో కోటీశ్వరులు అంటూ సందడి చెయ్యడానికి రెడీ అయ్యారు. ఎన్టీఆర్ హోస్ట్ గా వస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు షో కి మహేష్ గెస్ట్ అంటే.. ఫాన్స్ కి ఆగుతుందా.. ఇద్దరు హీరోలు ఓ షో లో కలిసి కనబడితే.. ఆ షోపై అంచనాలు ఆకాశంలో ఉంటాయి.

మరి మహేష్ బాబు - ఎన్టీఆర్ ఎపిసోడ్ త్వరలోనే అన్నప్పటినుండి ఫాన్స్ అంచనాలు పెరిగిపోతున్నాయి.. త్వరలోనే ప్రసారమవ్వబోతున్న మహేష్ ఎపిసోడ్ ప్రోమోని వదిలింది జెమినీ టివి. మహేష్ బాబు ని ఆహ్వానిస్తూ ఎన్టీఆర్ మహేష్ ని వెల్ కం మహేష్ అన్నా అంటూ హాగ్ చేసుకున్నాడు. మరి ఎంతో హ్యాండ్ సం గా ఉన్న మహేష్ బాబు - ఎన్టీఆర్ లు అలా హోస్ట్ సీట్ లో ఒకరు, హాట్ సీట్ లో మరొకరు కూర్చుంటే ఎవరు మీలో కోటీశ్వరులు షో కి కళ వచ్చేసింది. మహేష్ ఈ సెటప్ అదిరింది అన్నాడు. అంతేకాకుండా సరైన సమాధానమే కదా... దాన్ని అటు తిప్పి ఇటు తిప్పి కన్ఫ్యూజ్‌ చేయడం ఎందుకు అని మహేష్ అనగానే ఏదో సరదాగా అంటూ ఎన్టీఆర్ ఆటపట్టించిన.. తీరు మహేష్ కౌంటర్ గా నీకన్నా గురువుగారే (కంప్యూటర్‌) బెటర్‌గా ఉన్నారు అంటూ మహేష్ తో ఎన్టీఆర్ చేసిన రచ్చ కి ఫాన్స్ హ్యాపీగా ఫీలైపోతున్నారు. 

EMK: NTR-Mahesh Babu episode promo out:

NTR-Mahesh Babu Evaru Meelo Kotiswarulu episode promo out

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ