Advertisementt

ఎలాంటి అనుమానాలు వద్దంటున్న పుష్ప టీం

Tue 23rd Nov 2021 01:27 PM
allu arjun,pushpa the rise,allu arjun pushpa the rise movie,sukumar,rashmika,anasuya  ఎలాంటి అనుమానాలు వద్దంటున్న పుష్ప టీం
Pushpa team that speaks no suspicion ఎలాంటి అనుమానాలు వద్దంటున్న పుష్ప టీం
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో పాన్ ఇండియా లెవల్లో ఐదు భాషల్లో తెరకెక్కుతున్న పుష్ప మూవీ డిసెంబర్ 17 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కి రంగం సిద్ధం చెయ్యడమే కాదు.. ఆ దిశగా పుష్ప ప్రమోషన్స్ జోరు సోషల్ మీడియాలో మాములుగా లేదు. ప్రమోషన్స్ ని ఐదు భాషల్లోనూ ప్రేక్షకులని మెప్పించేలా చేయాడంలో ఇప్పటివరకు పుష్ప టీం పర్ఫెక్ట్ గా సక్సెస్ అయ్యింది. అయితే ఈ మధ్యన పుష్ప హిందీ రిలీజ్ పై అనుమానాలు వ్యక్తం చేసిన జనాలు.. ఇప్పుడు పుష్ప అనుకున్న టైం కి రిలీజ్ కాగలదా? ఐదు భాషల్లోనూ పుష్ప ని సక్రమంగా రిలీజ్ చెయ్యగలరా? అనే అనుమానాలు మొదలయ్యాయి. ఎందుకంటే పుష్ప షూటింగ్ ఫినిష్ చేసి ఇప్పుడే డబ్బింగ్ కార్యక్రమాల్లోకి దిగింది. ఐదు భాషాల్లో డబ్బింగ్ అంటే మాటలు కాదు.. చాలా రోజులు సమయం దీనికే పడుతుంది.

ఫైనల్ అవుట్ ఫుట్ సుకుమార్ కి నచ్చాలి.. ఎందుకంటే సుకుమార్ కి ఓ పట్టాన ఏది నచ్చదు. చెక్కిందే చెక్కే రకం.

తర్వాత సినిమా ప్రమోషన్స్ విషయంలో టీం అంతటిని ఏకతాటి మీదకి తీసుకురావాలి.. అటు చూస్తే సినిమా రిలీజ్ కి సమయం దగ్గర పడుతుంది. మహా అయితే ఇంకా 25 రోజుల టైం మాత్రమే ఉంది.. ఈలోపు పుష్ప పనులు సక్రమంగా పూర్తయినా.. ప్రమోషన్స్ విషయంలో కాస్త హడావిడీ జరిగి రిలీజ్ డేట్ మరొచ్చేమో అనే ఊహాగానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అందుకే పుష్ప టీం పదే పదే తగ్గేదేలే అంటూ డిసెంబర్ 17 నే పుష్ప వరల్డ్ వైడ్ గా ఐదు భాషల్లో రిలీజ్ అంటూ క్లారిటీ ఇచ్చుకుంటూ వస్తుంది. అల్లు అర్జున్ - రష్మిక జంటగా.. సమంత ఐటెం సాంగ్ చేస్తున్న ఈ మూవీలో ఫహద్ ఫాజిల్ విలన్.. ఇలా అన్ని క్రేజీగా కనిపిస్తుండడంతో.. సినిమాపై అన్ని భాషల్లోనూ అంచనాలు పెరిగిపోతున్నాయి.

Pushpa team that speaks no suspicion:

Allu Arjun Pushpa The Rise to release on Dec 17

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ