తెలుగులో నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 5 సక్సెస్ ఫుల్ గా స్టార్ మా లో రన్ అవుతుంది. ప్రస్తుతం ఎనిమిదిమంది సభ్యులతో బిగ్ బాస్ సీజన్ 5 చివరి దశలో ఉంది. అయితే ఇక్కడ తెలుగులో సజావుగా సాగుతున్న బిగ్ బాస్.. తమిళంలో మాత్రం సమస్యల్లో పడింది. తమిళంలో కమల్ హాసన్ హోస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 5 నడుస్తుంది. అయితే నిన్న కమల్ హాసన్ కి కరోనా సోకడంతో ఆయన హాస్పిటల్ లో చేరి కరోనా చికిత్స తీసుకుంటున్నారు. ఆయన యుఎస్ వెళ్లి వచ్చాక కాస్త జలుబు దగ్గు రావడంతో వెంటనే కరోనా టెస్ట్ లు చేయించుకోగా.. ఆయనకి కరోనా అని తేలింది.
దానితో ఆయన హాస్పిటల్ ఐసోలేషన్ లో చికిత్స తీసుకుంటున్నారు. మరి కమల్ కరోనా బారిన పడడంతో.. కమల్ హాసన్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 కి మరో హోస్ట్ గా ఇప్పుడు ఎవరు చేస్తారో అనే ఆశక్తి మొదలైంది. కమల్ శని, ఆదివారాలు ఎపిసోడ్స్ కి హోస్ట్ గా రావాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఆయన రాలేని పరిస్థితి. సో కమల్ ప్లేస్ లోకి ఎవరు హోస్ట్ గా వస్తారు అనేది సస్పెన్స్ గా మారింది. అయితే కమల్ హాసన్ ప్లేస్ లోకి గెస్ట్ హోస్ట్ గా శృతి హాసన్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా చెబుతున్నారు. కాదు విజయ్ సేతుపతి హోస్ట్ గా రావొచ్చనే ఊహాగానాలు మొదలైపోయాయి. మరోపక్క కమల్ హాసన్ నటిస్తున్న విక్రమ్ షూటింగ్ ని తాత్కాలికంగా ఆపేసారు లోకేష్ కనకరాజ్ అండ్ విక్రమ్ టీం.