Advertisementt

పవన్ ని రిక్వెస్ట్ చేస్తున్న రాజమౌళి

Mon 22nd Nov 2021 10:24 PM
rajamouli,pawan kalyan,rajamouli meet pawan kalyan,bheemla nayak,rajamouli rrr,rrr pan india film,pawan with rajamouli  పవన్ ని రిక్వెస్ట్ చేస్తున్న రాజమౌళి
Rajamouli requesting to Pawan Kalyan పవన్ ని రిక్వెస్ట్ చేస్తున్న రాజమౌళి
Advertisement
Ads by CJ

ఆర్.ఆర్.ఆర్ ని సేఫ్ గా ల్యాండ్ చేసేందుకు రాజమౌళి రంగంలోకి దిగిపోయారు. జనవరి 7 న రిలీజ్ కాబోతున్న ఆర్.ఆర్.ఆర్ కి పోటీ లేకుండా.. బాలీవుడ్ బడా దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీతో సంప్రదింపులు జరిపి ఆయన సినిమా గంగూభాయ్ కతీయవాది సినిమాని రేస్ నుండి తప్పించారు. ఆ తర్వాత సంజయ్ లీలా భన్సాలీకి సోషల్ మీడియాలో థాంక్స్ చెప్పారు రాజమౌళి. అక్కడ ఆర్.ఆర్.ఆర్ కి పోటీ లేకుండా చేసిన రాజమౌళి.. భీమ్లా నాయక్ హీరో పవన్ కళ్యాణ్ ని కలవబోతున్నారనే న్యూస్ ఫిలింసర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. గతంలో పవన్ కళ్యాణ్ తో సినిమా చెయ్యడానికి ట్రై చేసినా.. రాజమౌళికి పవన్ ఫోన్ చేయకపోవడంతో.. అప్పట్లో ఛాన్స్ మిస్ అయ్యింది.

అయితే మళ్ళీ రాజమౌళి పవన్ కళ్యాణ్ ని కలవబోతున్నారనగానే.. అందరూ పవన్ - రాజమౌళి కాంబో సెట్ అవడానికేమో అనుకుంటున్నారు. కానీ రాజమౌళి మాత్రం పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ ని సంక్రాంతి బరి  నుండి తప్పించమని అడగడానికి పవన్ ని మీట్ అవ్వాలని అనుకుంటున్నారట. పవన్ ని భీమ్లా నాయక్ మేకర్స్ ని కలిసి ఒప్పించి ఆర్.ఆర్.ఆర్ కి అవకాశం ఇవ్వమని అడగడానికి అంటున్నారు. మరి రాజమౌళి రిక్వెస్ట్ ని పవన్ యాక్సెప్ట్ చేసి.. భీమ్లా నాయక్ రిలీజ్ ని సంక్రాంతి కి అంటే జనవరి 12 నుండి పోస్ట్ పోన్ చేస్తారా.. లేదా అనేది ఇప్పడూ హాట్ టాపిక్ గా మారింది. 

Rajamouli requesting to Pawan Kalyan:

Rajamouli to meet Pawan Kalyan

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ