బోయపాటి శ్రీను - బాలకృష్ణ కాంబో అంటే.. మాస్ మసాలా అని లెజెండ్, సింహ మూవీస్ ప్రూవ్ చేసాయి. అందుకే మూడో సినిమా అఖండ పై అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. అందులోనూ బాలయ్య అఖండ లుక్, అఘోర లుక్స్ మాస్ ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకున్నాయి. బాలయ్య బాడీ లాంవేజ్, భారీ డైలాగ్స్, అఖండ లో యాక్షన్ సన్నివేశాలు, విలన్ శ్రీకాంత్ మేకోవర్ అన్ని సినిమాకి హైలెట్స్ అనేలా ఉన్నాయి. డిసెంబర్ 2 న రిలీజ్ కి రెడీ అయిన అఖండ మూవీ కి ఓవర్ సీస్ లో అనూహ్య స్పందన వస్తుంది. అక్కడ యుఎస్, ఆస్ట్రేలియాల లో లెక్కకు మించి థియేటర్స్ లో రిలీజ్ అవడమే కాదు...
అక్కడ ఓవర్ సీస్ లో అఖండ బుకింగ్స్ ఓపెన్ అయిన గంటలోనే థియేటర్స్ లో ఫుల్ గా టికెట్స్ అమ్ముడుపోవడం చూస్తుంటే.. బాలకృష్ణ గత సినిమాలు కథానాయకుడు, మహానాయకుడు తో పోయిన డబ్బులు ఈ సినిమాతో రకవరి అయిపోయినట్లే అని చెబుతున్నారు. అఖండ మూవీ తో మేకర్స్ భారీ లాభాలు మూట గట్టుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక అఖండ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిధిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాబోతున్నాడనే న్యూస్ నందమూరి ఫాన్స్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.