రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ - ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కిన ఆర్.ఆర్.ఆర్ మూవీ రిలీజ్ కి రేడి అవుతుంది. జనవరి 7 న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆర్.ఆర్.ఆర్ నుండి ఎలాంటి అప్ డేట్ వచ్చినా ఫాన్స్ దాన్ని క్షణాల్లో వైరల్ చేసేస్తున్నారు. ఇప్పటికే ఆర్.ఆర్.ఆర్ నుండి హీరోల టీజర్స్ తో పాటుగా దోస్తీ సాంగ్, అలాగే రీసెంట్ గా నాటు నాటు సాంగ్ తో ఎన్టీఆర్ - రామ్ చరణ్ ల ఊర మాస్ స్టెప్స్ ని ఫాన్స్ ఇంకా మరవకముందే ఆర్.ఆర్.ఆర్ నుండి మరో అదిరిపోయే అప్ డేట్ ఇచ్చేసారు మేకర్స్.
#RRRSoulAnthem, #Janani will be out on November 26th. Gear up for an emotionally captivating experience. #RRRMovie @ssrajamouli @tarak9999 @AlwaysRamCharan @ajaydevgn @aliaa08 @mmkeeravaani @DVVMovies @ర్ర్ర్మోవై @LahariMusic @TSeries
నవంబర్ 26 న ఆర్.ఆర్.ఆర్ ఆంథెమ్ జనని సాంగ్ ని రివీల్ చెయ్యబోతున్నట్టుగా మేకర్స్ అప్ డేట్ ఇవ్వడంతో.. ఆర్.ఆర్.ఆర్ ఫాన్స్ సోషల్ మీడియాలో అలెర్ట్ అయ్యారు. నాటు నాటు సాంగ్ ఇంకా యూట్యూబ్ లో సంచాలు సృష్టిస్తూనే వుంది.. మళ్ళీ ఆర్.ఆర్.ఆర్ ఆంథెమ్ వచ్చేస్తుంది అంటూ ఫాన్స్ రగడ మొదలు పెట్టేసారు. ఇక డిసెంబర్ అంతా ఆర్.ఆర్.ఆర్ టీం ప్రెస్ మీట్స్ తోనూ, ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ఆర్.ఆర్.ఆర్ ట్రైలర్ తోనూ హడావిడి చేసేందుకు ఏర్పాట్లు మొదలైపోయాయి.