Advertisementt

బిగ్ బాస్ 5: కాజల్, సన్నీ vs శ్రీరామ్

Mon 22nd Nov 2021 05:45 PM
bigg boss telugu 5,bigg boss,nomination fight,kajal,sunny vs sri ram chandra,kajal vs sriram  బిగ్ బాస్ 5: కాజల్, సన్నీ vs శ్రీరామ్
Bigg Boss 5: Kajal, Sunny vs Sri Ram Chandra బిగ్ బాస్ 5: కాజల్, సన్నీ vs శ్రీరామ్
Advertisement
Ads by CJ

ఈ రోజు సోమవారం బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ మంట రాజుకునే రోజు. వారమంతా అందరూ కలిసి ఉన్నట్టుగానే కనిపించినా.. ఈ సోమవారం వచ్చేసరికి నామినేషన్స్ పర్వం మొదలు కావడం, హౌస్ మేట్స్ అంతా నామినేట్ చెయ్యడానికి గాను.. రకరకాల కారణాలతో హౌస్ మేట్స్ ని రెచ్చగొట్టడంతో.. హౌస్ అంతా హీట్ ఎక్కిపోతుంది. తాజాగా ఈ రోజు నామీనేషన్స్ లో రవి vs కాజల్ అన్నట్టుగా వుంది. మరోపక్క శ్రీరామ్ ఆని మాస్టర్ ఎలిమినేట్ అయ్యింది కాజల్ స్ట్రాటజీ వలనే అని గొడవ పెట్టుకున్నాడు. నువ్వు ఎవిక్షన్ పాస్ ని సన్నీకి ఇవ్వడానికే.. ఇద్దరిని బలి పశువులని చేసావ్ అన్నాడు. ఆని మాస్టర్ ఎలిమినేట్ అవుతుంది అని నీకు తెలుసా అని కాజల్ శ్రీరామ్ ని ప్రశ్నించగా.. తెలుసు అన్నాడు. అని మాస్టర్ ని కావాలనే నీ గేమ్ తో బలి చేసావ్ అని కాజల్ ని అన్నాడు శ్రీరామ్. సన్నీ వీక్ కంటెస్టెంట్ నా.. నువ్వు ఎవిక్షన్ పాస్ సన్నీకి ఇచ్చావా అనగానే.. అవును నా ఫ్రెండ్ అందుకే సన్నీకి ఎవిక్షన్ పాస్ వచ్చేలా చేశాను అంది.

మధ్యలో సన్నీ మాట్లాడబోయాడు.. దానికి శ్రీరామ్ మరింతగా రియాక్ట్ అవుతూ నేను నీతో మాట్లాడేవరకు ఆగు.. నేను కాజల్ తో మాట్లాడుతున్నాను. మధ్యలోకి నువ్వు రావొద్దు అంటూ హెచ్చరించాడు శ్రీరామ్. అలా కాజల్ తో సన్నీతో గొడవపడిన శ్రీరామ్.. మీరంతా గ్రూప్ అన్నావ్ మరి మీరు అంది కాజల్.. అవును నేను షణ్ముఖ్, రవి, సిరి మేము నలుగురం ఓ గ్రూప్ ఏం చేసుకుంటావో చేసుకో అన్నాడు.. ఈ నామినేషన్ హీట్ లో కాజల్, సన్నీ కుండలు బద్దలు కొట్టి శ్రీరామ్ వీరిద్దరిని నామినేట్ చేసాడు. ఇక ఈ వారం కెప్టెన్ మానస్ తప్ప మిగతా వారంతా నామినేషన్స్ లోకి వెళ్లినట్టుగా తెలుస్తుంది.

Bigg Boss 5: Kajal, Sunny vs Sri Ram Chandra:

Bigg Boss Telugu 5: Nomination fight

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ