Advertisementt

బిగ్ బాస్ స్టేజ్ పై అనుభవించురాజా హీరో

Sun 21st Nov 2021 08:07 PM
nagarjuna,fun,raj tarun,supriya,bigg boss house,bigg boss telugu,big boss,anubhavinchu raja  బిగ్ బాస్ స్టేజ్ పై అనుభవించురాజా హీరో
Anubhavinchu Raja team at Bigg Boss Stage బిగ్ బాస్ స్టేజ్ పై అనుభవించురాజా హీరో
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 5 మొదలు పెట్టినప్పటినుండి.. తమ తమ సినిమాల ప్రమోషన్స్ కోసం యంగ్ హీరోస్ బిగ్ బాస్ స్టేజ్ పైకి వస్తున్నారు. గతంలో పూజ హెగ్డే, అఖిల్ అక్కినేని, ఇంకా రామ్ చరణ్ హాట్ స్టార్ బ్రాండ్ అంబాసిడర్ గాను, ఇంకా దసరా, దివాళి స్పెషల్ ఎపిసోడ్స్ లో మారుతి మంచి రోజులు వచ్చాయ్ అంటూ తమ సినిమాల ప్రమోషన్స్ చేసుకున్నారు. హౌస్ లోకి ఎంటర్ అవ్వకపోయినా.. బిగ్ బాస్ స్టేజ్ పైనే తమ సినిమాల ప్రమోషన్స్ చేసుకుంటున్నారు యంగ్ హీరోలు. ఇక ఈ రోజు ఆదివారం ఎలిమినేషన్ ఎపిసోడ్ కి అనుభవించు రాజా అంటూ అన్నపూర్ణ స్టుడియోస్ లో తెరకెక్కిన ఈ సినిమా హీరో రాజ్ తరుణ్ ఇంకా హీరోయిన్ లు నాగార్జునతో స్టేజ్ పై సందడి చేసారు.

రాజ్ తరుణ్ ని స్టేజ్ పై చూడగానే హౌస్ లో ఉన్న సిరి ఒక్కసారిగా అరిచేసింది. ఏంటి సిరి విశాఖ పట్నం కనెక్షనా అలా అరిచావ్ అన్నాడు నాగార్జున. అరె సిరి సంబంధాలు చూస్తున్నాం అని రాజ్ తరుణ్ అనగానే.. సిరి తలదించుకుంది.. నీక్కాదు అని రాజ్ తరుణ్ ట్విస్ట్ ఇచ్చాడు. రాజ్ తరుణ్ అండ్ నాగార్జున లు హౌస్ మేట్స్ తో గేమ్స్ ఆడారు.. అంతా కామెడీగా ఫన్నీగా సాగిన ఈ ఎపిసోడ్ లో ఎలిమినేషన్స్ ప్రక్రియ కూడా జరిగింది. చివరిగా అని మాస్టర్ - ప్రియాంక లు డేంజర్ జోన్ లో ఉన్నట్లుగా చూపించినా.. చివరికి ఈ రోజు అని మాస్టర్ ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ ని వీడిన విషయం విదితమే. 

Anubhavinchu Raja team at Bigg Boss Stage :

Nagarjuna fun with Raj tarun and Supriya

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ