Advertisementt

పిక్ టాక్: కొడుకుతో ఎన్టీఆర్

Sun 21st Nov 2021 07:06 PM
ntr,abhay ram,rrr pan india film,ntr wife lakshmi pranathi,bhargav ram  పిక్ టాక్: కొడుకుతో ఎన్టీఆర్
NTR snap with his son from France goes viral పిక్ టాక్: కొడుకుతో ఎన్టీఆర్
Advertisement
Ads by CJ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ షూటింగ్, ఎవరు మీలో కోటీశ్వరులు షో షూటింగ్ కంప్లీట్ చేసేసి.. దివాళి ని భార్య పిల్లలతో జరుపుకున్నాడు. జిమ్ లో వ్యాయామం చేస్తున్న టైం లో ఎన్టీఆర్ వేలికి గాయమై ఆపరేషన్ జరిగింది. కొన్ని వారాల పాటు ఎన్టీఆర్ ఇంట్లోనే రెస్ట్ తీసుకోబోతున్నారని అన్నారు. అయితే దివాళి తర్వాత ఈ గ్యాప్ లో ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి, పిల్లలు భార్గవ్ రామ్, అభయ్ రామ్ లతో కలిసి స్విట్జర్లాండ్ వెకేషన్ కి వెళ్ళొచ్చేసాడు. పారిస్, స్విట్జర్లాండ్ అంటూ వెకేషన్ ని ఎంజాయ్ చేసి.. నిన్న శనివారమే హైదరాబాద్ కి తిరిగి వచ్చాడు ఎన్టీఆర్ ఆయన ఫ్యామిలీ తో కలిసి.

ఇక ఈ రోజు ఆదివారం ఎన్టీఆర్ తన కొడుకు అభయ్ రామ్‌తో కలిసి తన స్నాప్‌ను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. ఫ్రాన్స్‌లోని ప్యారిస్‌లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఈఫిల్ టవర్ నేపథ్యంలో ఎన్టీఆర్ తన పెద్ద కొడుకు అభయ్‌ని ముద్దుపెట్టుకుంటున్న ఆ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మాములుగా నే ఫ్యామిలీని పెద్దగా మీడియా ముందు ఫోకస్ అవ్వనివ్వడు. అందుకే ఇలాంటి రేర్ పిక్స్ చూసిన వెంటనే క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ తో NTR30, ప్రశాంత్ నీల్ తో NTR31 మూవీస్ చేయడానికి కమిట్ అయ్యాడు.

NTR snap with his son from France goes viral:

NTR snap with his son Abhay ram from France goes viral

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ