Advertisementt

సత్యన్నారాయణ హెల్త్ అప్ డేట్ ఇచ్చిన చిరు

Sun 21st Nov 2021 04:54 PM
kaikala satyanarayana,satyanarayana health,chiranjeevi,megastar,apollo hospital  సత్యన్నారాయణ హెల్త్ అప్ డేట్ ఇచ్చిన చిరు
Chiranjeevi inquires about Satyanarayana health సత్యన్నారాయణ హెల్త్ అప్ డేట్ ఇచ్చిన చిరు
Advertisement
Ads by CJ

సీనియర్ యాక్టర్ కైకాల సత్యన్నారాయణ తీవ్ర అనారోగ్యం పాలవడంతో ఆయన కుటుంబ సభ్యులు హుటాహుటిన జూబ్లీహిల్స్ లోని అపోలో హాస్పిటల్ కి తరలించగా.. ఆయనకి అపోలో వైద్యులు ఐసియులో ఉంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అయితే నిన్న ఉదయం ఆయన హాస్పిటల్ లో జాయిన్ అవగా.. గత రాత్రి అపోలో వైద్యులు సత్యన్నారాయణ హెల్త్ అప్ డేట్ విడుదల చేసారు. అందులో సత్యన్నారాయణ క్రిటికల్ కండిషన్ లో ఉన్నారని, ఆయన ఆర్గాన్స్ పనిచెయ్యడం లేదని హెల్త్ అప్ డేట్ ఇవ్వగానే సినీప్రముఖులు, అభిమానులు ఆందోళనకి గురయ్యారు. 

అయితే మెగాస్టార్ చిరు అపోలో వైద్యులని సత్యన్నారాయణ హెల్త్ విషయై సంప్రదించగా.. డాక్టర్స్ వీడియో కాల్ లో చిరు సత్యన్నారాయణ గారిని చూసే ఏర్పాట్లు చెయ్యడంతో.. చిరు ఆయన్ని చూసాక, సత్యన్నారాయణ గారి ఆరోగ్యం మెరుగవుతుంది అని, మీరు పూర్తి ఆరోగ్యంతో బయటికి వచ్చాక సెలెబ్రేట్ చేసుకోవాలని అనగానే.. ఆయన చేతి బొటన వేలిని పైకి చూపించారంటూ చిరు సత్యన్నారాయణ హెల్త్ అప్ డేట్ ఇవ్వడంతో.. ఆయన ఆరోగ్యం విషయంలో ఆందోళన పడుతున్న అభిమానులు కూల్ అయ్యారు. 

 

Chiranjeevi inquires about Satyanarayana health:

Satyanarayana health: Chiranjeevi raises hope

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ