Advertisementt

అందరి చూపు అలియా పైనే

Sun 21st Nov 2021 01:21 PM
alia bhatt,rrr heroine,alia bhatt at her bestie sister wedding,alia bhatt new look  అందరి చూపు అలియా పైనే
Alia Bhatt latest look viral అందరి చూపు అలియా పైనే
Advertisement
Ads by CJ

బాలీవుడ్ బ్యూటీ అలియా భట్.. ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. కారణం అలియా భట్ నటించిన పాన్ ఇండియా ఫిలిం ఆర్.ఆర్.ఆర్ తో పాటుగా ఆమె బాలీవుడ్ లో నటించిన గంగూభాయ్ కతీయవాది సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమవడంతో.. ఈ చిన్నది ఇకపై మీడియాలో తరచూ కనిపిస్తుంది. ఆయా సినిమాల ప్రమోషన్స్ తో అలియా భట్ ఇకపై మీడియా కి దగ్గరలోనే ఉంటుంది. అయితే తాజాగా బాలీవుడ్ లో ఓ వెడ్డింగ్ పార్టీలో అలియా భట్ సందడి చేసింది.. ఈ వెడ్డింగ్ రిసెప్షన్ కి అలియానే కాదు బాలీవుడ్  సెలబ్రిటీస్ చాలామంది హాజరయ్యారు.

కానీ అందరి చూపు ఆర్.ఆర్.ఆర్ భామ అలియా భట్ పైనే. ఎందుకంటే అలియా భట్ ధరించిన డ్రెస్ ఆలా ఉంది. ఆమె అవుట్ ఫిట్ కి అందరూ ఫిదా అవుతున్నారు.. అందరూ క్లివేజ్ షో కోసం తాపత్రయ పడితే అలియా భట్.. ఆ క్లివేజ్ షో చెయ్యకుండా.. అద్భుతమైన అవుట్ ఫిట్ లో అదరగొట్టేసింది. గ్లామర్ కి గ్లామర్, అందానికి అందం చూపిస్తూ అందరి చూపు తనపైనే పడేలా చేసుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో అలియా భట్ ఈ డ్రెస్ విషయమై తెగ ట్రెండ్ అవుతుంది. ఇక అలియా భట్ రణబీర్ కపూర్ తో ప్రేమలో మునిగి తేలడమే కాదు త్వరలోనే పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నట్టుగా తెలుస్తుంది.

Alia Bhatt latest look viral:

Alia Bhatt At Her Bestie Sister Wedding

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ