Advertisementt

చంద్రాబాబుకి సూపర్ స్టార్ ఫోన్

Sun 21st Nov 2021 11:10 AM
superstar rajinikanth,chandrababu naidu,tdp,bhuvaneswari,ntr,nandamuri family,kalyan ram,ashwini dutt,k. raghavendra rao  చంద్రాబాబుకి సూపర్ స్టార్ ఫోన్
Superstar Rajinikanth calls Chandrababu Naidu చంద్రాబాబుకి సూపర్ స్టార్ ఫోన్
Advertisement
Ads by CJ

టీడీపీ అధినేత, నారా చంద్రబాబు నాయుడు మీడియా ఎదుట వైసిపి చేసిన ఘోర అవమానభారంతో.. కన్నీళ్లు పెట్టుకోవడం హాట్ టాపిక్ గా మారింది. చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్ నాయకుడు అలా మీడియా ఎదుట భోరున విలిపించడం ఎవరూ తట్టుకోలేకపోతున్నారు. నందమూరి ఫ్యామిలీ అయితే కుటుంబం మొత్తం మీడియా ముందుకు వచ్చి భువనేశ్వరిని టార్గెట్ చేయడంపై ఖండించారు. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, అశ్విని దత్, కె రాఘవేంద్రరావు లాంటి వాళ్ళు ఈ విషయాన్ని ఖండించడమే కాదు, చంద్రబాబు ని ఓదార్చారు. అయితే తాజాగా చంద్రబాబు నాయుడు కి సూపర్ స్టార్ రజినీకాంత్ ఫోన్ చెయ్యడం చర్చనీయాంశం అయ్యింది.

ఏపీ అసెంబ్లీలో శుక్రవారం చంద్రబాబు, ఆయన భార్య భువనేశ్వరిని లక్ష్యంగా చేసుకుని వైసిపి పార్టీ మంత్రులు వ్యక్తిగతంగా దూషించడంపై సూపర్ స్టార్ రజనీకాంత్ విచారం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు ఫోన్ చేసిన రజనీకాంత్ ఫోన్ లోనే పరామర్శించారు. ఏపీలో ప్రస్తుత పరిస్థితులపై ఆరా తీశారు. కేవలం రజినీకాంత్ మాత్రమే కాదు.. చాలామంది రాజకీయ, సినీ ప్రముఖులు ఈ విషయంలో చంద్రబాబుకి సపోర్ట్ గా నిలుస్తున్నారు. 

Superstar Rajinikanth calls Chandrababu Naidu :

Rajinikanth calls CBN

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ